News November 19, 2025
KMR: నేటి నుంచి పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభం: కలెక్టర్

కామారెడ్డి జిల్లాలోని పత్తి రైతులు బుధవారం నుంచి CCI కేంద్రాలకు పత్తిని తీసుకువెళ్లాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి సమస్యల పరిష్కారానికి మంగళవారం ఆయన కీలక సమావేశం నిర్వహించారు. మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు జిన్నింగ్ మిల్లర్లతో చర్చించారు. హామీలను నెరవేరుస్తామని చెప్పడంతో మిల్లుల యజమానులు బంద్ విరమించారని కలెక్టర్ తెలిపారు.
Similar News
News January 16, 2026
విజయవాడలో దారుణం.. సహజీవనం చేస్తున్న మహిళ హత్య!

విజయవాడ కేదారేశ్వరరావుపేటలో దారుణం జరిగింది. శివ కుమార్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్న హుస్సేన అనే వివాహిత శుక్రవారం తెల్లవారుజామున హత్యకు గురైంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే శివ కుమార్ ఆమెను హతమార్చి పరారైనట్లు సమాచారం. అజిత్‌సింగ్‌నగర్ సీఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
News January 16, 2026
NLG: రైతులకు అలర్ట్.. ఫార్మర్ రిజిస్ట్రీ లేకుంటే పథకాలు కట్

వ్యవసాయ ఆధునికీకరణలో భాగంగా ప్రభుత్వం ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ నమోదును తప్పనిసరి చేసింది. ఈ ఐడీ ఉంటేనే పీఎం కిసాన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి అందుతుందని అధికారులు తెలిపారు. ఉమ్మడి నల్గొండలో ఇంకా చాలా మంది రైతులు నమోదు చేసుకోకపోవడంతో ఏఈవోలు లేదా మీ-సేవా కేంద్రాలను రైతులు సంప్రదించాలని వారు సూచించారు. భవిష్యత్తులో పథకాలు పొందాలంటే ఈ నమోదు కీలకమని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.
News January 16, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు బెయిల్ వస్తుందా?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సిట్ ఇప్పటికే ఆయన్ను 14 రోజులపాటు కస్టడీకి తీసుకొని విచారించింది. ఇందుకు సంబంధించి నివేదికను ఈరోజు కోర్టులో సమర్పించనుంది. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు అనుమతి కోరే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుకు బెయిల్ వస్తుందా? లేదా అరెస్టుకు కోర్టు అనుమతిస్తుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.


