News October 8, 2025
KMR: నేడే కీలక తీర్పు.. జిల్లాలో ఉత్కంఠ

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన బీసీ రిజర్వేషన్లపై కీలకమైన కోర్టు తీర్పు నేడు వెలువడనుంది. దీంతో కామారెడ్డి జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు జిల్లాలోని 25 జడ్పీటీసీ, 25 ఎంపీపీ పదవుల భవితవ్యాన్ని, అలాగే 233 ఎంపీటీసీ స్థానాలు, 532 గ్రామ సర్పంచుల స్థానాల ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయనుంది. కోర్టు తీర్పు కోసం జిల్లాలోని రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News January 15, 2026
అన్నమయ్య జిల్లా ఉద్యోగులకు రూ.36 కోట్ల జమ

అన్నమ్య జిల్లా ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. జిల్లాలో 15వేల మంది సీపీఎస్ ఉద్యోగులు, 12వేల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరికి 30 నెలల డీఏ, అరియర్స్ రావాల్సి ఉంది. 2018 జులై నుంచి 2020 డిసెంబర్ వరకు సంబంధించిన బకాయిలు రూ.36కోట్లు వారి ఖాతాల్లో జమచేసింది. మొత్తం 27వేల మంది ఉండగా ఒక్కొక్కరి సరాసరి రూ.30వేలు వాళ్ల ఖాతాలో జమైంది.
News January 15, 2026
బాలింతలు యాంటీబయాటిక్స్ తీసుకోవచ్చా?

పాలిచ్చే తల్లులు యాంటీబయాటిక్స్ తీసుకోవచ్చా లేదా అనేది వారి ఆరోగ్యస్థితిపై ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే పిల్లల వయసు, ఆరోగ్యం, తల్లికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి డాక్టర్లు యాంటీబయాటిక్స్ రాస్తారు. పాలద్వారా యాంటీబయాటిక్స్ తక్కువ మొత్తంలోనే ట్రాన్స్‌ఫర్ అవుతాయి. అయినా ఇలాంటి మందులేవైనా వాడేముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోనే వాటిని వాడాలని సూచిస్తున్నారు.
News January 15, 2026
పెద్దపల్లి: సర్పంచ్‌లకు రెండు విడతల్లో శిక్షణ

పెద్దపల్లి జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు రెండు విడతలుగా ప్రభుత్వం శిక్షణ అందించనుంది. ఈనెల 19 నుంచి 23 వరకు మొదటి విడత, ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు రెండో విడత తరగతులు నిర్వహిస్తారు. పెద్దపల్లి మండలంలోని మదర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలలో సర్పంచ్‌లకు శిక్షణ అందించనున్నారు. మొదట విడతలో కమాన్‌పూర్, పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, పాలకుర్తి, కాల్వ శ్రీరాంపూర్ సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు.


