News March 16, 2025
KMR: పేదరికాన్ని జయించాడు. సర్కార్ నౌకరి సాధించాడు

గాంధారి మండలం నేరాల తాండకు చెందిన బర్దవాల్ మెగరాజ్ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికై పలువురికి ఆదర్శంగా నిలిచాడు. పేదరికంలో పుట్టి పెరిగిన మెగరాజ్ ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కష్టపడి ప్రభుత్వ అధ్యాపకుడిగా ఉద్యోగం సాధించాడు. ఇప్పుడు దోమకొండలో ప్రభుత్వ కళాశాలలో చరిత్ర అధ్యాపకుడిగా బాధ్యతలు స్వీకరించాడు. కాగా మెగరాజ్ ప్రభుత్వ పాఠశాల, కళాశాలలోనే విద్యనభ్యసించాడు.
Similar News
News February 17, 2026
పాపన్నపేట: వనదుర్గమ్మకు బోనం సమర్పించిన జోగిని

పాపన్నపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల దుర్గామాత అమ్మవారికి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి జోగిని శ్యామల బోనం సమర్పించారు. డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించారు. యేటా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.
News February 17, 2026
నేడు విశాఖకు రాష్ట్రపతి

AP: రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు విశాఖపట్నం చేరుకోనున్నారు. 4.40PMకు నేవల్ ఎయిర్ స్టేషన్ ‘INS డేగా’ వద్ద ల్యాండ్ అవుతారు. నేవల్ బేస్‌లో నిర్వహించే విందులో పాల్గొంటారు. భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్‌గా రేపు అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. గవర్నర్ జస్టిస్ నజీర్, సీఎం చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు విశాఖ వెళ్లనున్నారు.
News February 17, 2026
తూ.గో: JEE మెయిన్స్‌లో శ్రీ ప్రకాశ్ విద్యార్థుల ప్రభంజనం

JEE మెయిన్స్ ఫలితాల్లో శ్రీ ప్రకాశ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. జె.మోనేశ్ కుమార్ 99.93, టి.కృష్ణ 98.44 పెర్సంటైల్ సాధించినట్లు సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్ ప్రకాశ్ తెలిపారు. తాము IIT- JEE కోచింగ్ వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. విజేతలను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె నరసింహారావు, ప్రిన్సిపల్ వి.వి.ఎస్.ఎస్ భానుమూర్తి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.


