News March 13, 2025

KMR: భూములను గుర్తించి ప్రతిపాదనలు సమర్పిస్తాం: కలెక్టర్

image

రాష్ట్ర ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడారు. కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో ITI ల ఏర్పాటుకు అవసరమైన రెండు ఎకరాల చొప్పున భూములను గుర్తించి ప్రతిపాదనలు సమర్పిస్తామన్నారు. బిచ్కుందలో ITI ఉందని తెలిపారు.

Similar News

News February 16, 2026

ఆదిలాబాద్‌ బల్దియాలో బీజేపీకి భంగపాటు

image

ఆదిలాబాద్‌‌లో కమలదళానికి గట్టి షాక్ తగిలింది. 21మంది కౌన్సిలర్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడంలో బీజేపీ విఫలమైంది. స్వతంత్ర అభ్యర్థుల మద్దతుపై గంపెడు ఆశలు పెట్టుకున్న నేతలకు, చివరి నిమిషంలో వారు హ్యాండ్ ఇవ్వడంతో పీఠం చేజారిపోయింది. స్వతంత్ర అభ్యర్థికి కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు మద్దతు ప్రకటించడంతో సమీకరణాలు తలకిందులయ్యాయి.

News February 16, 2026

తిరుమల శ్రీవారి దర్శనం కోసం మే నెల దర్శనం కోటా విడుదల

image

TTD మే–2026 నెలకు సంబంధించిన దర్శనాలు, సేవలు, గదుల కోటాల షెడ్యూల్ ప్రకటించింది.
ఫిబ్రవరి 18 – ఆర్జిత సేవా టికెట్లు విడుదల, 21 – ఇతర సేవలు, వర్చువల్ సేవలు విడుదల, 23 – అంగప్రదక్షిణం, శ్రీవాణి, వృద్ధులు–దివ్యాంగుల దర్శనం, 24 – ప్రత్యేక ప్రవేశ దర్శనం, గదుల కోటా, 27 – శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటా టికెట్లు అన్నీ ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

News February 16, 2026

ఆదిలాబాద్‌ వైస్ ఛైర్మన్‌గా ఎండీ రోహిత్

image

ఆదిలాబాద్‌ మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా 44వ వార్డు కౌన్సిలర్ ఎండీ రోహిత్ ఎన్నికయ్యారు. సోమవారం అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావు పర్యవేక్షణలో జరిగిన ఎన్నికలో రోహిత్‌కు 27 మంది కౌన్సిలర్లు మద్దతు పలికారు. ఛైర్‌పర్సన్ ఎన్నిక తరహాలోనే వైస్ ఛైర్మన్ ఎంపికలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్ర సభ్యులు ఆయనకు ఓటు వేశారు. మెజారిటీ సభ్యుల మద్దతు లభించడంతో రోహిత్ ఎన్నికైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.