News March 6, 2025
KMR: మార్చి 8న లోక్ అదాలత్: SP

మార్చి 8న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని KMR జిల్లా ఎస్పీ సింధుశర్మ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాజీమార్గంతో కేసులను త్వరగా పరిష్కరించవచ్చని ఆమె సూచించారు. గతంలో పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల కేసులను లోక్ అదాలతో పరిష్కరించుకోవాలని సూచచించారు. ప్రతి ఒక్కరూ సహకరించలన్నారు. పోలీస్ అధికారులు రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాలను రాజీపడేటట్లు అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News December 6, 2025
కరీంనగర్: ఉప సర్పంచ్ పదవిపై బడానేతల కన్ను..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు తమకు కలసిరానిచోట, మహిళా రిజర్వేషన్లు వచ్చినచోట ఉప సర్పంచ్ పదవిపై బడా నేతలు కన్నేశారు. రిజర్వేషన్ల ప్రభావంతో సర్పంచిగా పోటీ చేయలేని కొందరు నాయకులు తమకు అనుకూలమైన వారిని సర్పంచ్, వార్డు మెంబర్లగా నిలిపి పరోక్షంగా వారు పోటీ చేస్తున్నారు. ఉప సర్పంచ్‌కి చెక్ పవర్ ఉండడం, సర్పంచ్ రానప్పుడు సభలు నడిపే అధికారం ఉండడంతో ఈ పదవికి పోటీ పెరుగుతోంది.
News December 6, 2025
‘రహదారి భద్రతా, డిఫెన్సివ్ డ్రైవింగ్’పై శిక్షణ

అమరావతి ఇంటిగ్రేటెడ్ అర‍్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (AIUDP) అమలు కార్యకలాపాలలో భాగంగా రహదారి భద్రతపై అవగాహన కోసం APCRDA కార్యాలయంలో కాంట్రాక్టర్స్ సిబ్బందికి “రహదారి భద్రతా & డిఫెన్సివ్ డ్రైవింగ్”పై శిక్షణ కార్యక్రమం జరిగింది. ప్రమాదాలకు గురయ్యే వారి రక్షణ ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదాల నివారణకు పాటించాల్సిన విధానాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు.
News December 6, 2025
HYD: మహా GHMCలో 250 డివిజన్లు.!

గ్రేటర్‌లో శివారు ప్రాంతాలు విలీనమైన నేపథ్యంలో డివిజన్‌ల పునర్విభజన జరుగుతోంది. స్థానిక సంస్థలను డివిజన్‌లను జీహెచ్ఎంసీ అధికారులు మారుస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోకి కొత్తగా 50 డివిజన్లు చేరనున్నాయి. వీటితో జీహెచ్ఎంసీలో 220 నుంచి 250 వరకు డివిజన్‌లు అవనున్నాయి. ఇప్పటికే జనాభా లెక్కన డివిజన్లను విభజించారు. దీంతో మహా జీహెచ్ఎంసీ 10 జోన్లు, 50 సర్కిళ్ళుగా మారుతుంది.


