News November 19, 2025

KMR: రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండండి: ఎస్పీ

image

కామారెడ్డి జిల్లాలో నెలకొన్న తీవ్రమైన పొగమంచు నేపథ్యంలో వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. తక్కువ వీక్షణ సామర్థ్యం కారణంగా ఎదురు వాహనాలు, పాదచారులు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. పొగమంచు సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని ఎస్పీ హెచ్చరించారు.

Similar News

News January 17, 2026

నగలు సర్దేయండిలా..

image

మహిళలకు అలంకారం, ఆభరణాలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. మార్కెట్లోకి లేటెస్ట్‌గా ఏ నగ వచ్చినా సరే కొనేయాల్సిందే. అయితే వాటిని సరిగ్గా భద్రపరచకపోతే అవి కొన్నాళ్లకు రంగుమారి పాడైపోతాయి. ఇలాకాకుండా ఉండాలంటే..ఆభరణాలు భద్రపరిచే ముందు శుభ్రంగా తుడిచి ఆరబెట్టిన తర్వాతే బాక్సుల్లో సర్దాలి. అన్ని రకాల నగలను ఒకే బాక్సులో పెట్టకూడదు. విడివిడిగా ఎయిర్‌టైట్ బాక్సులు, జిప్ లాక్ బ్యాగులు వాడాలి.

News January 17, 2026

HYD: ఉన్నది 42 లక్షలు.. పన్ను మాత్రం 27 లక్షల గృహాలకే..!

image

జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 42 లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఆస్తి పన్ను లెక్కల ప్రకారం మాత్రం నగర వ్యాప్తంగా కేవలం 27 లక్షల గృహాలే పన్ను పరిధిలో నమోదయి ఉన్నాయి. మిగిలిన గృహాలు పన్ను పరిధిలోకి రాకపోవడంతో జీహెచ్ఎంసీకి ఆదాయంలో భారీగా నష్టం జరుగుతోందని అధికారులు భావిస్తున్నారు. పన్ను వసూళ్లు పెంచటం కోసం GIS సర్వే చేపట్టినా ఎక్కడి వరకు వచ్చిందో..? తెలియని పరిస్థితి.

News January 17, 2026

హైదరాబాద్ మెట్రో ఇక సర్కారు సొంతం!

image

HYD మెట్రోలో కొత్త అధ్యాయం మొదలైంది. L&T కున్న రూ.13,000 కోట్ల అప్పును ప్రభుత్వం స్వీకరిస్తూ, మరో ₹2,000 కోట్లను వాటా కింద చెల్లించి ప్రాజెక్టును పూర్తిగా స్వాధీనం చేసుకోనుంది. దీంతో మెట్రో నిర్వహణ, టికెట్ ధరలు, విస్తరణపై ప్రభుత్వానికి పూర్తి అధికారం దక్కనుంది. ఈ ప్రక్రియను మార్చి 2026 నాటికి పూర్తి చేసి మెట్రోను ప్రజలకు మరింత చేరువ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.