News December 1, 2025

KMR: రెండో దశ తొలి రోజు 155 నామినేషన్లు

image

కామారెడ్డి జిల్లాలో రెండో విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఈ విడతలో మెుదటి రోజు 197 గ్రామ పంచాయతీలు 1,654 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం ఒక్కరోజే సర్పంచ్ స్థానాలకు 81 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 74 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News February 11, 2026

సోషల్ మీడియాలో ఫేక్ AI కంటెంట్.. కేంద్రం కీలక ఆదేశాలు

image

సోషల్ మీడియాలో AI కంటెంట్‌కు SM ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా లేబుల్ వేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తప్పుదోవ పట్టించే లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్‌ తొలగింపు విషయంలో కోర్టు/ప్రభుత్వం ఆదేశించిన 3 గంటల్లోగా తొలగించాలని గడువు విధించింది. అంతకుముందు 36 గంటలు గడువు ఉండగా ఈ నెల 20 నుంచి ఈ ఉత్తర్వులు అమలుకానున్నాయి. AI కంటెంట్ దుర్వినియోగంపై యూజర్లకు 3 నెలలకోసారి అవగాహన కల్పించాలని తెలిపింది.

News February 11, 2026

వరుస హత్యలతో సీతంపేటలో ఆందోళన!

image

MHBD(D) గార్ల మండలం సీతంపేట పరిధిలో గత రెండేళ్లుగా జరుగుతున్న వరుస హత్యలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మహేష్‌ అనే యువకుడి హత్య, అంకన్నగూడెంలో కన్నబిడ్డలకే విషమిచ్చి దంపతుల ఆత్మహత్య, అత్తను అల్లుడే కరెంట్ షాక్‌తో చంపడం వంటి ఘటనలు కలకలం రేపాయి. మానవతా విలువలు మంటగలుస్తున్నాయని, ఇలాంటి నేరాల నియంత్రణకు పోలీసులు, సామాజిక సంస్థలు అవగాహన సదస్సులు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.

News February 11, 2026

గోళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలెస్ట్రాల్

image

బాడీలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగినప్పుడు గోళ్లలో మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గులాబీ రంగులో ఉండే గోళ్లు రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడంతో రంగుమారి పాలిపోయినట్టు/తెల్లగా కనిపిస్తాయి. ఒనికోరెక్సిస్ అని పిలిచే గాట్లు ఏర్పడతాయి. రక్త ప్రవాహం తగ్గడంతో పెరుగుదలకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఒంకరగా పెరుగుతాయి. కొందరిలో నీలం/ఊదా రంగులో కనిపిస్తాయి.