News March 27, 2025
KMR: వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో అనుమతి లేని వడ్డీ వ్యాపారులపై బుధవారం పోలీసు అధికారులు దాడులు నిర్వహించారు. 69 దాడుల్లో.. 16 కేసులు నమోదు చేయగా, వారి వద్ద నుంచి విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వడ్డీ వ్యాపారంతో అమాయకులను మోసం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
Similar News
News April 18, 2025
గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయాలి: కవిత

TG: గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసి పరీక్షను మళ్లీ నిర్వహించాలని సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని అన్నారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి పడిపోయాయని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో సందేహాలు ఉన్నాయన్నారు.
News April 18, 2025
విడాకుల బాటలో మరో సెలబ్రిటీ జంట?

హీరోయిన్ నజ్రియా నజీమ్, ఫహాద్ ఫాజిల్ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. SMలో నజ్రియా పెట్టిన ఓ పోస్ట్ దీనికి బలం చేకూరుస్తోంది. ‘నేను డిప్రెషన్‌లోకి వెళ్లాను. ‘సూక్ష్మదర్శిని’ విజయాన్ని కూడా ఆస్వాదించలేకపోయా. ఇది చాలా కఠినమైన సమయం. పూర్తిగా కోలుకుని మళ్లీ మీ ముందుకొస్తా’ అంటూ రాసుకొచ్చారు. ఫహాద్‌తో విడాకుల వ్యవహారంతోనే ఆమె డిప్రెషన్‌లో వెళ్లారేమోనని నెటిజన్లు భావిస్తున్నారు.
News April 18, 2025
మస్క్‌తో చర్చలు.. మోదీ ట్వీట్

ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌తో చర్చలు జరిపినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించామని ప్రధాని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరువురి మధ్య జరిగిన విషయాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ రంగాలలో భారత్, అమెరికా భాగస్వామ్యం మరింత పురోగమిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.