News May 7, 2025

KMR: విస్తరణ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

మద్దెల చెరువు-పిట్లం రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అటవీ, రోడ్లు భవనాల శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అటవీ ప్రాంతం కాని చోట చెట్ల నరికివేతకు అటవీ శాఖ అనుమతులు జారీ చేసిందని చెప్పారు. అటవీ ప్రాంతంలో చేపట్టాల్సిన పనుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకొని పనులు ప్రారంభిచాలని అధికారులకు సూచించారు.

Similar News

News February 13, 2026

వేములవాడ మున్సిపాలిటీలో హంగ్

image

వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. మొత్తం 28 వార్డులకు కాంగ్రెస్ 13 చోట్ల జయకేతనం ఎగురవేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 8 స్థానాలు గెలుచుకోగా, బీఆర్ఎస్ 5 వార్డులకే పరిమితమైంది. రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మెజారిటీ స్థానాలు దక్కినప్పటికీ ఛైర్‌పర్సన్ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీకి మరొక కౌన్సిలర్ మద్దతు ఏర్పడింది.

News February 13, 2026

పాలమూరు: సీఎం సొంతగడ్డపై కాంగ్రెస్ హవా!

image

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో కాంగ్రెస్ తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. కొడంగల్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులకు 10 కైవసం చేసుకొని ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మద్దూరు 12 స్థానాలకు హోరాహోరి పోరు సాగినప్పటికీ 9వార్డులు గెలిచి ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. కోస్గి మున్సిపాలిటీలో 16 స్థానాలకు గాను ఇప్పటికే 8 గెలిచి కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగిస్తుంది.

News February 13, 2026

BREAKING: వైరా మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

image

వైరా మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 20 వార్డులకు గాను 11 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 2 వార్డులు ఇతరులు గెలిచారు. మిగతా వార్డులకు సంబంధించి కౌంటింగ్ జరుగుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.