News August 13, 2025
KMR: వెంకట్.. ఐదు రూపాల్లో సజీవం

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేటకు చెందని బానోత్ వెంకట్(24) బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టడంతో చికిత్స పొందుతూ 2021లో మృతి చెందాడు. కొడుకు మరణంతో విషాదంలో మునిగిన అతని తల్లిదండ్రులు గుండె పగిలే బాధలోనూ గొప్ప మనసు చాటుకున్నారు. కుమారుని అవయవాలను దానం చేశారు. కుమారుని ప్రాణాలు కోల్పోయినా, మారో ఐదుగురికి ప్రాణాలు కాపాడేందుకు వెంకట్ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ఎంతో ఆదర్శణీయం.
Similar News
News March 11, 2026
ఏలూరు: రెండో రోజు ఏసీబీ దాడులు కొనసాగే అవకాశం!

ఏలూరు కార్పొరేషన్ పై మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఏసీబీ దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో కీలక రికార్డులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ ప్రణాళిక విభాగంలో అనుమతులు ఎలా ఇస్తున్నారు అనే అంశంపై, ఇటీవల బదిలీ అయినప్పటికీ కొందరు అధికారులు పలుకుబడిని ఉపయోగించి తిరిగి ఏలూరులోనే కొనసాగడంపై అధికారులు ఆరా తీశారు. దాడులు బుధవారం కూడా కొనసాగే అవకాశం ఉందని సమాచారం.
News March 11, 2026
గత ‘ఇందిరమ్మ’ బిల్లుల గోల్‌మాల్.. విచారణకు ఆదేశం

వైఎస్ఆర్ హయాంలో కొందరు నేతలు తమకు తెలియకుండానే తమ పేర్లపై ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు డ్రా చేశారని వేంసూరు బాధితులు గ్రీవెన్స్‌లో మొరపెట్టుకున్నారు. ఈ పాత రికార్డుల వల్ల ఇప్పుడు కొత్త ఇళ్లకు తాము అనర్హులమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి కేసులు వేలల్లో ఉండటంతో అధికారులు విచారణ చేపట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని గృహనిర్మాణ శాఖ ఈఈ శ్రీనివాస్ నాయక్ హామీ ఇచ్చారు.
News March 11, 2026
MBNR: లిఫ్ట్ ఇచ్చి మహిళపై సామూహిక అత్యాచారం

ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన జడ్చర్లలో వెలుగు చూసింది. స్థానికుల వివరాలు.. పట్టణానికి చెందిన ఓ మహిళ రాత్రి రోడ్డుపై వెళ్తున్న బైకర్స్‌ను లిఫ్ట్ అడిగింది. బైక్‌పైఉన్న ఇద్దరు యువకులు ఆమెను ఎక్కించుకుని మున్సిపాలిటీని దాటగానే బైక్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మహిళపై ఇద్దరు యువకులు వరుసగా అత్యాచారం చేశారు. వారి నుంచి తప్పించుకున్న మహిళ నేరుగా PSకు చేరుకొని ఫిర్యాదు చేసింది.


