News May 7, 2025
KMR: షీ టీం సభ్యులకు SP అభినందనలు

కామారెడ్డి జిల్లాలో మహిళల రక్షణ కోసం అంకితభావంతో పని చేస్తున్న షీ టీమ్ సభ్యులు సౌజన్య, ప్రవీణలను జిల్లా SP రాజేశ్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వారి సేవలను కొనియాడుతూ.. నగదు పురస్కారాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళల భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో వారి పాత్ర ఎంతో ప్రశంసనీయమైనదని ఎస్పీ కొనియాడారు.
Similar News
News February 18, 2026
పోలవరం జిల్లా నోడల్ ఆఫీసర్‌గా విశ్వనాథ్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్) పోలవరం జిల్లా నోడల్ ఆఫీసర్‌గా రంపచోడవరం డ్వామా APD. విశ్వనాథ్ బుధవారం నియమితులయ్యారు. ఈ మేరకు కలెక్టర్ దినేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి గ్రీవెన్స్‌లో వచ్చిన ప్రతీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని విశ్వనాథ్ అన్నారు. జేసీ స్మరణ్ రాజ్ ఆదేశాల మేరకు అధికారుల సహకారంతో గ్రీవెన్స్ నిర్వహిస్తామని తెలిపారు.
News February 18, 2026
తిరుపతిలో లిఫ్ట్ ఇస్తే చైన్ కొట్టేశాడు..!

తిరుపతి రూరల్ పేరూరుకు చెందిన రఘునాథ్ రెడ్డి(36) బైకుపై వెళ్తుండగా చెర్లోపల్లిలోని వైన్ షాపు వద్ద ఓ వ్యక్తి లిఫ్ట్ అడగడంతో ఎక్కించుకున్నాడు. పాస్ వస్తుందని జూపార్క్ సమీపంలో బైకు ఆపాలని కోరాడు. తిరిగి బైక్ ఎక్కే సమయంలో రఘునాథ రెడ్డి మెడలోని 18 గ్రాముల బంగారు చైన్‌ను అతడు లాక్కెళ్లిపోయాడు. నిందితుడు వైట్ కలర్ టీ షర్ట్‌పై బ్లూ కలర్ జాకెట్ ధరించి ఉన్నాడు. అతడిని గుర్తిస్తే చెప్పాలని పోలీసులు కోరారు.
News February 18, 2026
కామారెడ్డి MLA వెంకటరమణారెడ్డి అబద్ధాల కోరు: కాంగ్రెస్ నేతలు

కామారెడ్డి MLA వెంకటరమణారెడ్డి వైఖరిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కన్న తండ్రిపైనే చేయి చేసుకున్న చరిత్ర ఉన్న MLAకు, షబ్బీర్ అలీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ఎన్నికల అఫిడవిట్‌లో అబద్ధాలు చెప్పారని, రూ.150 కోట్ల అభివృద్ధిపై ప్రజలను వంచిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఐటీ శాఖకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.


