News August 13, 2025

KMR: సమాచారం ఇవ్వాలి.. లేదంటే రూ. 25వేల జరిమానా

image

RTI చట్టం ప్రకారం దరఖాస్తు అందిన 30 రోజుల్లోపు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని, అలా చేయని అధికారులపై చట్టపరమైన చర్యలతో పాటు రూ.25 వేల వరకు జరిమానా విధిస్తామని రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ డా. చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తప్పనిసరిగా సిటిజన్ చార్ట్ ప్రదర్శించాలని, అందులో అందించే సేవలు, అధికారుల వివరాలు, సేవలు అందించే సమయం వంటివి స్పష్టంగా పొందుపరచాలని ఆయన సూచించారు.

Similar News

News March 14, 2026

‘సంభల్’లో నమాజ్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

image

<<15204583>>వివాదాస్పద సంభల్‌‌<<>>లోని మసీదులో నమాజ్ చేసే వ్యక్తుల సంఖ్యను పరిమితం చేయాలన్న UP అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. శాంతిభద్రతలను పరిరక్షించలేకపోతే SP, కలెక్టర్ బదిలీ చేయించుకోవాలని, లేదంటే రిజైన్ చేయాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రతి కమ్యూనిటీకి కేటాయించిన స్థలంలో శాంతియుతంగా ప్రార్థనలు చేసుకునేలా చేయడం ప్రభుత్వ విధి అని తెలిపింది.

News March 14, 2026

రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం లేకుండా ప్రభుత్వం అప్రమత్తం: హోంమంత్రి అనిత

image

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామిని హోంమంత్రి అనిత శనివారం దర్శించుకున్నారు. రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం లేకుండా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు RTGS ద్వారా పరిస్థితులను సమీక్షిస్తున్నారని చెప్పారు. RTGS రాష్ట్రానికి గుండె లాంటిదని మంత్రి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులను నమ్మవద్దని సూచించారు.

News March 14, 2026

10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్: కలెక్టర్

image

కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద కఠినంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరీక్షల సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి కేంద్రంలోనూ తాగునీరు, ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.