News August 14, 2025
KMR: స్వాతంత్ర్య వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా కోదండ రెడ్డి

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కామారెడ్డి జిల్లా ముస్తాబవుతోంది. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి హాజరు కానున్నారని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా.. జిల్లా పరిపాలనా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. వేడుకలు ఘనంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Similar News
News March 13, 2026
రెస్టారెంటు బిల్లులో ‘LPG సర్‌ఛార్జ్’

బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో పలు రెస్టారెంట్లు బిల్లులో ‘LPG సర్‌ఛార్జ్’ కలిపి వేస్తున్నాయి. గ్యాస్ కొరతతో ఉన్న నిల్వలనే వాడుకోవాల్సి రావడం, ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.10-30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. అటు హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో టిఫిన్ రేట్లు పెరిగిపోయాయి. సాధారణంగా రూ.30-40 ఉండే మసాలా దోశ ధరను రూ.60కి పెంచేశారు.
News March 13, 2026
వరంగల్: టెన్త్ పరీక్షలకు గ్యాస్ కష్టాలు!

వారం రోజుల్లో ముగించాల్సిన పది పరీక్షలను నెల పాటు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 14 నుంచి వచ్చే నెల 13 వరకు పరీక్షలను నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఒక్కో పరీక్షకు 5 రోజుల పాటు విరామం ఇచ్చారు. ఇరాన్ యుద్దంతో ఇప్పటికే గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. మరో నెల పాటు పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5,17,727 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో సగం మంది హస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు.
News March 13, 2026
యుద్ధం.. నెల్లూరు జిల్లాలో భారీగా తగ్గిన ధరలు

ఏటా వేసవిలో గూడూరు నిమ్మ మార్కెట్‌లో ధరలు పెరుగుతుంటాయి. ఇప్పుడు ఎండలు మండిపోతున్నా ధరలు పడిపోతున్నాయి. కారణం యుద్ధం. విదేశాలకు ఎగుమతులు ఆగిపోయాయి. చిన్న హోటల్స్ నుంచి 5స్టార్ హోటల్స్ వరకు నిమ్మకాయలు కొంటారు. గ్యాస్ కొరతతో హోటళ్లు మూత పడటంతో ధరలు భారీగా తగ్గిపోయాయి. 2రోజుల కిందట KG నిమ్మకాయలు రూ.110 ఉండగా నేడు కేజీ రూ.80-రూ.85 మాత్రమే ఉంది. మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.


