News December 1, 2025
KMR: 12 వార్డు మెంబర్లు, ఒక సర్పంచ్ నామినేషన్లు తిరస్కరణ

కామారెడ్డి డివిజన్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలు, మొదటి విడత 2025కు సంబంధించి సర్పంచ్, వార్డ్ మెంబర్ల నామినేషన్ల పరిశీలన పూర్తయినట్లు ఉప జిల్లా ఎన్నికల అథారిటీ అధికారి, RDO వీణ తెలిపారు. డివిజన్ పరిధిలో 12 వార్డు మెంబర్లు, ఒక సర్పంచ్ పదవీ నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు వెల్లడించారు. సోమవారం నలుగురు వార్డు మెంబర్ల పోటీదారులు తమ వద్ద అప్పీలు చేసుకుని ఉన్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 16, 2026
మిర్యాలగూడలో 22 ఏళ్లకే వార్డు కౌన్సిలర్‌గా ఎన్నిక

మిర్యాలగూడ మున్సిపాలిటీలో అతి చిన్న వయసులో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. పట్టణంలోని 26వ వార్డు నుంచి పోదిల నిక్షిత్(22) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 22 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేశారు. ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి వెంకన్న ప్రజలకు చేస్తున్న సేవలకు ఆకర్షితులై రాజకీయాలకు వచ్చినట్లు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
News February 16, 2026
కోదాడ: కర్ల రాజేశ్ తల్లికి పెన్షన్, భూమి, ఇల్లు: కలెక్టర్

పోలీస్ లాకప్‌లో మృతిచెందిన కోదాడకు చెందిన కర్ల రాజేశ్ మాతృమూర్తికి ప్రభుత్వం నుంచి రావాల్సిన పెన్షన్, మూడు ఎకరాల భూమి, ఇళ్లు అందిస్తామని సోమవారం రాజేశ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యుడు రామచంద్రన్‌కు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. రాజేశ్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతీది అందిస్తామన్నారు.
News February 16, 2026
చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం: నల్గొండ కలెక్టర్

నల్గొండ జిల్లాలోని చెరువులు, కుంటల ఆక్రమణలపై కలెక్టర్ బి.చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రంలో ఆక్రమణలను గుర్తించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జలవనరులు కలుషితం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. భవిష్యత్తులో కబ్జాలకు తావులేకుండా నిఘా పెంచాలని స్పష్టం చేశారు.


