News November 16, 2025

KMR: 3.19 మీటర్ల పైకి భూగర్భ జలాలు

image

కామారెడ్డి జిల్లాలో భూగర్భ జలాల స్థాయి గణనీయంగా పెరిగినట్లు జిల్లా భూగర్భ జల అధికారి సతీష్ తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది నీటి మట్టం ఏకంగా 3.19 మీటర్లు పెరిగిందని Way2Newsతో చెప్పారు. ఈసారి వర్షపాతం 1,402.7 మి.మీ. వర్షపాతం నమోదయ్యిందని.. ఏకంగా 58.4% అధిక వర్షపాతం పడిందన్నారు. జిల్లాలో అన్ని చెరువులు, కుంటల్లో నీళ్లు ఉండడంతో రబీ పంటలకు సాగుకు ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.

Similar News

News January 23, 2026

ఒంగోలు మీదుగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..!

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్తగా తాంబరం–సంత్రాగాచి–తాంబరం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ (16107/16108) వారానికి ఒకసారి నడవనుంది. జనవరి 23 నుంచి తాంబరం నుంచి, జనవరి 24 నుంచి సంత్రాగాచి నుంచి సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ రైలు ఒంగోలు మీదుగా ప్రయాణించనుంది. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించనుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.

News January 23, 2026

నిర్మల్: 101వ బర్త్‌డే జరుపుకున్న బామ్మ

image

నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌కు చెందిన మారవేని గంగవ్వకు 101 వడిలో అడుగుపెట్టారు. దీంతో ఆమె కుటుంబీకులు గురువారం పుట్టిన రోజు వేడుకలు జరిపారు. గంగవ్వకు మొత్తం 9 మంది సంతానం. తన కొడుకులు, కుమార్తెలు, మనువళ్లు అంతా కలిసి మొత్తం 92 మంది ఉన్నారు. ఆమె 101 సంవత్సరంలో అడుగుపెట్టడంతో అంతా ఒక చోట కలిసి అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు.

News January 23, 2026

గవర్నర్‌కు ‘ఖమ్మం’ రుచుల విందు!

image

నేడు సూర్యాపేట జిల్లాకు రానున్న గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ కోసం ఖమ్మం వంటకాలు సిద్ధమవుతున్నాయి. నగరంలోని ‘అమ్మ మెస్‌’, ‘రెస్టిన్‌’ హోటల్‌ నిర్వాహకులు ఏకంగా 32రకాల శాకాహార వంటకాలతో మెనూ ఖరారు చేశారు. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పనసకాయ బిర్యానీ, పచ్చిమిర్చి టమాట పచ్చడి సిద్ధం చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల కార్యక్రమాలకు ఈ హోటల్స్ విందు అందించాయి.