News September 11, 2025

KMR: 73 మందికి జరిమానా.. ఒకరికి జైలు

image

మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై KMR జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 73 మందికి కోర్టు జరిమానా విధించింది. బిక్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి కోర్టు రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది. మద్యం తాగి వాహనం నడపడం ప్రాణాంతకమని ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు.

Similar News

News December 6, 2025

హైదరాబాద్‌లో హారన్ మోతలకు చెక్.!

image

హైదరాబాద్‌లో రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోతోంది. దీనికితోడు హారన్‌ల మోత మోగుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు యోచిస్తున్నారు. ముంబై తరహాలో “హాంక్ మోర్ వెయిట్ మోర్” పద్ధతిని తీసుకురానున్నారు. దీంతో రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఎంత ఎక్కువగా హారన్ కొడితే అంత ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తుంది. దీని వల్ల ముంబైలో 60% సౌండ్ పొల్యూషన్ తగ్గింది. ఇదే తరహాలో ఇక్కడ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

News December 6, 2025

కుంభం ఇలాఖాలో BRS బలపరిచిన అభ్యర్థి ఏకగ్రీవం

image

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి ఇలాఖాలో మొట్టమొదటగా బీఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భువనగిరి మండలం పీఎన్ తిమ్మాపురం సర్పంచ్ అభ్యర్థిగా ఎడ్ల వెంకట్ రెడ్డిని బీఆర్ఎస్ బలపరిచింది. కాంగ్రెస్, బీజేపీ తరఫున నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులు విత్‌డ్రా చేసుకోవడంతో వెంకట్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది.

News December 6, 2025

సల్కర్ పేటలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

image

గడిచిన 24 గంటల్లో మహబూబ్ నగర్ జిల్లాల్లో చలి తీవ్రత స్వల్పంగా పెరిగింది. గండీడ్ మండలం సల్కర్ పేటలో 12.8 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. బాలానగర్ 13.3, మిడ్జిల్ మండలం దోనూరు 13.4, రాజాపూర్ 13.6, జడ్చర్ల 14.1, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్, పారుపల్లి 14.7, భూత్పూర్ 14.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది.