News September 10, 2025
KMR: CM పర్యటన.. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ

ఈ నెల 15న కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్, VIP రాకపోకల మార్గాలను ఆయన పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. CM పర్యటనలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News December 13, 2025
మరో అరగంటలో ఉప్పల్ స్టేడియానికి మెస్సీ!

హైదరాబాద్‌లో మెస్సీ మేనియా నడుస్తోంది. మరో అరగంటలో ఆయన ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి రానున్నట్లు సమాచారం. దీంతో వందలాది మంది ఫుడ్ బాల్ క్రీడాకారులు, అభిమానులు పాస్‌లు తీసుకొని స్టేడియానికి పోటెత్తారు. మరోవైపు పోలీసులు భారీ బందోబస్తు నడుమ స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. కొందరేమో మెస్సీకి అభివాదం చెప్పేందుకు స్టేడియం బయట బారులు తీరారు.
News December 13, 2025
నిజామాబాద్: పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా: బీజీపీ అధ్యక్షుడు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాపై తీవ్ర విమర్శలు చేశారు. కేవలం రాజకీయ ఉనికి కోసం ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సూర్యనారాయణ రూ.138 కోట్ల నిధులు తెచ్చారని గుర్తు చేశారు. పదేళ్ల పాలన శూన్యమన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
News December 13, 2025
నక్సలిజం పాము లాంటిది: అమిత్ షా

నక్సలిజం ఎవరికీ ప్రయోజనం కలిగించదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. శాంతి మాత్రమే అభివృద్ధికి మార్గం చూపగలదని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ‘నక్సలిజం విషపూరితమైన పాము లాంటిది. దాన్ని అంతం చేసిన తర్వాత అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది’ అని బస్తర్ ఒలింపిక్-2025 ముగింపు కార్యక్రమంలో పేర్కొన్నారు.


