News November 19, 2025

KNL: పిల్లల హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

image

భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కన్నబిడ్డలను చంపిన కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2018లో సింధ్ ధనోజీ రావు తన కూతురు నిఖిత (7), కొడుకు మధు చరణ్‌ (4)ను నంద్యాల జిల్లాలోని జూపాడుబంగ్లా ప్రాంతంలో నీటి కుంటలో ముంచి చంపాడు. ఈ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో కర్నూలులోని 7వ న్యాయస్థానం జడ్జి నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2 వేల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News January 13, 2026

తొలిసారి మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ!

image

TG: రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఈనెల 18న మేడారం జాతర ప్రాంతంలో కేబినెట్ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆమోదం, రైతు భరోసా పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మంత్రులు, కీలక ఐఏఎస్ అధికారులు మేడారానికి రానున్నారు. మరోవైపు సంక్రాంతి తర్వాత 16 నుంచి సీఎం జిల్లాల పర్యటన ప్రారంభించనున్నట్లు సమాచారం.

News January 13, 2026

ధనుర్మాసం: ఇరవై తొమ్మిదో రోజు కీర్తన

image

కృష్ణుడిని సేవిస్తూ అండాళ్ తెలిపిన వ్రత పరమార్థం ఇది: ‘ఓ గోవిందా! మేము వేకువనే నీ సన్నిధికి వచ్చింది కోరికలు నెరవేర్చమని కాదు! మా జన్మజన్మల బంధం నీతోనే ఉండాలని, ఏడేడు జన్మల వరకు నీకే దాస్యం చేస్తూ నీ సేవలో తరించాలని! మా మనసులో ఉండే ఇతర కోరికలను తొలగించు. నీ పాద సేవ పట్ల అనురక్తిని ప్రసాదించు’ అని భగవంతుడిని ఏమీ ఆశించకుండా, నిరంతర సేవా భాగ్యాన్ని కోరుకుంటున్నారు. ఇదే నిజమైన భక్తి. <<-se>>#DHANURMASAM<<>>

News January 13, 2026

జగిత్యాల: గల్ఫ్ ఏజెంట్ అరెస్ట్.. 114 పాస్‌పోర్టులు స్వాధీనం

image

జగిత్యాల పట్టణంలో కన్సల్టెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న గల్ఫ్ ఏజెంట్ కాముని గంగాధర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 114 పాస్‌పోర్టులు, ల్యాప్‌ట్యాప్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు DSP రఘు చందర్ వెల్లడించారు. పెంబట్లకు చెందిన గంగాధర్ అమాయకులను నమ్మించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు అందిన సమాచారంతో నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.