News November 19, 2025
KNL: పిల్లల హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కన్నబిడ్డలను చంపిన కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2018లో సింధ్ ధనోజీ రావు తన కూతురు నిఖిత (7), కొడుకు మధు చరణ్ (4)ను నంద్యాల జిల్లాలోని జూపాడుబంగ్లా ప్రాంతంలో నీటి కుంటలో ముంచి చంపాడు. ఈ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో కర్నూలులోని 7వ న్యాయస్థానం జడ్జి నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2 వేల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 20, 2026
నంద్యాల కలెక్టర్‌కు అవార్డు

నంద్యాల జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి జి.రాజకుమారి ఉత్తమ ఎన్నికల నిర్వహణ అవార్డుకు ఎంపికయ్యారు. 2025 సంవత్సరానికి గానూ ఉత్తమ ఎన్నికల పద్ధతులను అమలు చేసినందుకు ఈ పురస్కారం లభించింది. జనవరి 25న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు.
News January 20, 2026
పార్క్‌లు పరిశుభ్రంగా ఉండేలా చూడండి: వరంగల్ కమిషనర్

పార్క్‌లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ హార్టికల్టర్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని డాక్టర్స్ కాలనీ పార్క్, టెలికాం పార్క్, క్రిస్టియన్ కాలనీ పార్క్, టీఆర్‌టీ పార్క్‌లను కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించి సమర్థంగా చేపట్టేందుకు అధికారులకు తగు సూచనలు చేశారు. పార్క్‌లను శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
News January 20, 2026
దావోస్‌లో సీఎం టీమ్.. టార్గెట్ ఇన్వెస్ట్‌మెంట్స్

TG CM రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడిన బృందం దావోస్‌లో పెట్టుబడుల వేట మొదలుపెట్టింది. హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీని వరల్డ్ క్లాస్ గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు UAE ప్రభుత్వంతో చేతులు కలిపింది. అటు ఇజ్రాయెల్‌కు చెందిన స్టార్టప్ కంపెనీలు రాష్ట్రంలో ఏఐ సంబంధిత పైలట్ ప్రాజెక్టులు చేపట్టేందుకు అంగీకరించాయి.


