News November 19, 2025

KNL: పిల్లల హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

image

భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కన్నబిడ్డలను చంపిన కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2018లో సింధ్ ధనోజీ రావు తన కూతురు నిఖిత (7), కొడుకు మధు చరణ్‌ (4)ను నంద్యాల జిల్లాలోని జూపాడుబంగ్లా ప్రాంతంలో నీటి కుంటలో ముంచి చంపాడు. ఈ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో కర్నూలులోని 7వ న్యాయస్థానం జడ్జి నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2 వేల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News January 17, 2026

ఏపీ ఎన్జీవో హోమ్ అభివృద్ధికి చర్యలు: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

రాజమండ్రి ఏపీ ఎన్జీవో హోమ్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మేఘ స్వరూప్ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం ఎన్జీవో సంఘ ప్రతినిధులు కలెక్టరేట్‌లో ఆయనకు వినతిపత్రం అందజేశారు. రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భవనాన్ని ఆధునీకరించాలని కోరారు. ఈ సందర్భంగా సంఘం డైరీ, క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు.

News January 17, 2026

మెదక్: మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు: కలెక్టర్

image

మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల వార్డు రిజర్వేషన్లను రాజకీయ పార్టీల సమక్షంలో పారదర్శకంగా ఖరారు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్‌లో 32, తూప్రాన్‌లో 16, నర్సాపూర్‌లో 15, రామాయంపేటలో 12 వార్డులకు రిజర్వేషన్లు కేటాయించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

News January 17, 2026

నెల్లూరు: డ్రస్ సర్కిల్’ డ్రా విజేతకు కార్ అందజేత

image

నెల్లూరులోని ప్రముఖ వస్త్ర దుకాణం ‘డ్రస్ సర్కిల్ షాపింగ్ మాల్’లో క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి సందర్భంగా ‘భలే ఛాన్స్ బాసు’ లక్కీ డ్రాను ప్రవేశపెట్టారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి జనవరి 15 వరకు జరిగిన వస్త్రాల కొనుగోళ్లపై కూపన్లు అందించారు. ఈ డ్రాలో N.దయాకర్ రెడ్డి (కూపన్ నంబర్: 21038) మొదటి బహుమతిగా కారును గెలుచుకున్నారు.