News November 19, 2025
KNL: పిల్లల హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కన్నబిడ్డలను చంపిన కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2018లో సింధ్ ధనోజీ రావు తన కూతురు నిఖిత (7), కొడుకు మధు చరణ్ (4)ను నంద్యాల జిల్లాలోని జూపాడుబంగ్లా ప్రాంతంలో నీటి కుంటలో ముంచి చంపాడు. ఈ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో కర్నూలులోని 7వ న్యాయస్థానం జడ్జి నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2 వేల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 23, 2026
వసంత పంచమి వేడుకలు ఎలా చేసుకోవాలంటే..

వసంత పంచమి వేడుకల్లో పసుపు రంగుకు ప్రాధాన్యం ఎక్కువ. ప్రజలు తెల్లవారునే లేచి, పసుపు రంగు దుస్తులు ధరించి సరస్వతీ పూజ చేస్తారు. పసుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా పెట్టి పంచుకుంటారు. కొందరు శివపార్వతులను పూజిస్తారు. మరికొందరు సూర్య నమస్కారాలు చేస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విందులు ఆరగిస్తూ, పాటలతో, నృత్యాలతో ఈ వసంత ఆగమనాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
News January 23, 2026
నేడు వికారాబాద్‌లో స్పీకర్‌ను కలవొచ్చు

నేడు తెలంగాణ శాసనసభపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ రానున్నారు ఉ. 10:00 గం.కు హైదరాబాద్ మినిస్టర్ కోటర్స్ నుంచి వికారాబాద్ బయలుదేరుతారు. 12:00 గం.కు వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
News January 23, 2026
ఏలేశ్వరం: విద్యుత్ వినియోగదారులకు గమనిక

ఏలేశ్వరం మండలంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యలో 2 గంటల వరకు అంతరాయం ఏర్పడుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీరభద్రరావు అన్నారు. సబ్ స్టేషన్‌లో ఫిడర్లపై స్విచ్ అరేంజ్ చేయుటకు, లక్ష్మీపురం, గొంటువానిపాలెం, తిమ్మాపురం బద్రవరం, పేరవరం, ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో కొన్ని ఏరియాల్లో విద్యుత్ అంతరాయం కలుగుతుందని దీనిని ప్రజలు గమనించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలిపారు.


