News November 19, 2025
KNL: పిల్లల హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కన్నబిడ్డలను చంపిన కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2018లో సింధ్ ధనోజీ రావు తన కూతురు నిఖిత (7), కొడుకు మధు చరణ్ (4)ను నంద్యాల జిల్లాలోని జూపాడుబంగ్లా ప్రాంతంలో నీటి కుంటలో ముంచి చంపాడు. ఈ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో కర్నూలులోని 7వ న్యాయస్థానం జడ్జి నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2 వేల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 23, 2026
తిరుపతి: మూడో రోజు 35 మంది గైర్హాజరు

తిరుపతి జిల్లాలో JEE మెయిన్స్ పరీక్షలు మూడో రోజు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తిరుపతి సిటీ కోఆర్డినేటర్ టి.కైలాష్ నాథ్ మాట్లాడుతూ.. మొత్తం 2,111 మందికి గాను 2,076 మంది అభ్యర్థులు హాజరయ్యారని చెప్పారు. 35 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్ష ముగిసింది.
News January 23, 2026
పీఎం శ్రీ పనులు సకాలంలో పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

జగిత్యాల జిల్లాలో పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన 20 పాఠశాలల్లో మంజూరైన పనులను సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత హెచ్ఎంలను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిధులను నాణ్యతతో ఖర్చు చేసి పనులు వేగంగా పూర్తి చేస్తే తదుపరి విడత నిధులు వచ్చే అవకాశముందని తెలిపారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పనులను గడువులోపు పూర్తి చేయాలని సూచించారు.
News January 23, 2026
పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సిద్ధమవ్వండి: జేసీ ఆదేశం

జిల్లాలో అప్సడా రిజిస్ట్రేషన్లు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అధికారులతో గూగుల్ మీట్ ద్వారా మాట్లాడిన ఆయన.. ఫిబ్రవరి 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న పాస్ పుస్తకాల పంపిణీకి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రీ-సర్వే అంశాలనూ వేగవంతం చేయాలన్నారు.


