News May 14, 2024
KNRలో EVMలు ఎక్కడెక్కడ మొరాయించాయంటే.?

*పోల్ చీటీలు అందకపోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో పేర్లు ఉండి ప్రస్తుత ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడంతో పలువురు నిరాశ చెందారు.
*వావిలాలపల్లిలో ఈవీఎం పని చేయకపోవడంతో పోలింగ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.
*ఓటరు చీటీ మీద కేంద్రం కెన్‌క్రెస్ట్ పాఠశాల పేరు ఉండగా.. అక్కడికి వెళ్లి చూసే సరికి SR పాఠశాల బోర్డు కనిపించడంతో ఓటర్లు అయోమయానికి గురయ్యారు.
*చిగురుమామిడి, శంకరపట్నం మండలాల్లో ఈవీఎంలు మొరాయించాయి.
Similar News
News December 9, 2025
చొప్పదండి: నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహణపై శిక్షణ కార్యక్రమం

చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఈనెల 13న జరగనున్న దృష్ట్యా, నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్(పరీక్షలు) సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాల నిర్వహణ అధికారులు పాల్గొన్నారు. పరీక్ష నిర్వహణపై విధి విధానాలు చర్చించి, సామగ్రిని నిర్వాహకులకు అందజేశారు. ఇన్చార్జి ప్రిన్సిపల్ బ్రహ్మానందరెడ్డి, ఎంఈఓ మోహన్ పాల్గొన్నారు
News December 8, 2025
కరీంనగర్ డీఈఓగా అదనపు కలెక్టర్

కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారిగా అదనపు కలెక్టర్ అశ్విని తనాజీ వాంక్డేకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఈ నవీన్ నికోలావీస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇన్చార్జి డీఈఓగా ఉన్న శ్రీరామ్ మొండయ్య ఇకపై డైట్ ప్రిన్సిపాల్‌గా కొనసాగనున్నారు. పలువురు డీఈఓ పదవికి ఆసక్తి చూపకపోవడం గమనార్హం.
News December 8, 2025
KNR: స్విమ్మింగ్‌లో బ్రాంజ్ మెడల్‌తో మెరిసిన స్వరణ్

ఆదిలాబాద్ వేదికగా జరుగుతున్న సౌత్ జోన్ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్విమ్మర్ కంకణాల స్వరణ్ సత్తా చాటాడు. గ్రూప్-1 కేటగిరీలో 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించాడు. స్వరణ్‌ను క్రీడా అధికారి శ్రీనివాస్ గౌడ్, స్విమ్మింగ్ అసోసియేషన్ ట్రెజరర్ కృష్ణమూర్తితో పాటు కోచ్‌లు ఘనంగా అభినందించారు.


