News May 4, 2024

KNR: ఈ సారైనా పోలింగ్ శాతం పెరిగేనా?

image

ఓటర్లు అసెంబ్లీ ఎన్నికలపై చూపినంత ఆసక్తి లోక్‌సభ ఎన్నికలపై చూపడం లేదు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య పెరుగుతున్నా పోలింగ్ శాతం మాత్రం పెరగడం లేదు. 2014లో జరిగిన ఎన్నికల్లో 74.71 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019 ఎన్నికల నాటికి అది కాస్తా 69.52 శాతంకు తగ్గింది. ఈసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్యను మరింత పెంచాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Similar News

News December 6, 2025

కరీంనగర్‌లో రెచ్చిపోతున్న ‘భూ’ బకాసురులు..!

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో భూ మాఫియా మళ్లీ రెచ్చిపోతుంది. భగత్ నగర్‌లోని ఓ స్థలాన్ని మాజీ కార్పొరేటర్ కబ్జా చేయగా లేక్ PS ముందు ఓ ఫ్లాట్లో నిర్మించిన గోడను కూల్చేశారు. రాంనగర్‌లోని పార్క్ స్థలమూ కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. అభిషేక్ మహంతి CPగా ఉన్నప్పుడు కబ్జాలపై వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఏర్పాటు చేసి భూ బకాసురులపై ఉక్కుపాదం మోపారు. CP మారడంతో ఆ కార్యక్రమాలు నిలిచిపోయాయి.

News December 5, 2025

ఎంఈవోలకు కరీంనగర్ కలెక్టర్ కీలక ఆదేశాలు

image

కరీంనగర్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఎంఈవోలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రతి పదవ తరగతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ప్రత్యేక అధికారులు పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న స్పెషల్ క్లాసులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు స్లిప్ టెస్టులు నిర్వహిస్తూ బోర్డు పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో కనీసం 20 మంది పిల్లల ఉండాలన్నారు.

News December 5, 2025

వలస కూలీల పిల్లలను బడిలో చేర్చాలి: KNR కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో వలస కూలీలు, ఇటుక బట్టీల కార్మికుల పిల్లలను గుర్తించి ప్రత్యేక పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యాధికారులను ఆదేశించారు. పిల్లలకు రవాణా సాయం అందించాలని ఇటుక బట్టీల యజమానులను కోరారు. అలాగే, పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, స్పెషల్ క్లాస్‌లు పర్యవేక్షించి నూరు శాతం ఫలితాలు సాధించాలని సూచించారు.