News October 8, 2025
KNR: ఈ APPతో మీ ఊరి నిధులు తెలుసుకోవచ్చు..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామాపంచాయతీలకు విడుదలైన నిధులను, అధికారులు ఖర్చు చేసిన ఫండ్స్‌ను తెలుసుకోవాలనుకుంటున్నారా?. అయితే మీ ఫోన్లో కేంద్రానికి సంబంధించి యాప్ ‘మేరీ పంచాయత్’ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. దీని ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివరాలతో పాటు, ఏ పనులకు ఎంత వెచ్చించారు, పనులు ఏ దశలో ఉన్నాయోనని కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వచ్చే ఏడాదికి సంబంధించి అంచనా వివరాలనూ చూడవచ్చు.
Similar News
News January 19, 2026
NGKL: తెలుగు సాహిత్యానికి రుక్మంధ రెడ్డి జీవితం అంకితం

వెల్దండ మండలానికి చెందిన ప్రముఖ పద్య కవి <<18894607>>రుక్మంధర రెడ్డి<<>> తన జీవితాన్ని మొత్తం సాహిత్యానికే అంకితం చేశారు. ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయుడిగా, పదవీ విరమణ అనంతరం తెలుగు అధ్యాపకుడిగా వందల మందిని తెలుగు సాహిత్య వేత్తలుగా, తెలుగు ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు. పది పుస్తకాలను రచించారు. ఎందరో వర్తమాన కవులకు సాహిత్య మెలకువలను అందించారు. ఎన్నో సన్మానాలను, అవార్డులను అందుకున్నారు.
News January 19, 2026
40 ఏళ్లు నిండాయా? ఈ టెస్టులు చేయించుకోండి

40 ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో హార్మోన్ మార్పులు, నెలసరి సమస్యలు, మెనోపాజ్ వేధిస్తుంటాయి. తీవ్రమైన వ్యాధులను ముందుగానే గుర్తించడానికి వారు కొన్ని పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఏడాదికోసారి ఫుల్ బాడీ చెకప్, షుగర్, BP, కొలెస్ట్రాల్, థైరాయిడ్ టెస్టులు, 2-3 ఏళ్లకోసారి సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, బోన్ హెల్త్ టెస్టు, 1-2 ఏళ్లకు కంటి, డెంటల్ పరీక్షలు, మెంటల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి.
News January 19, 2026
కేజీబీవీలకు తాత్కాలిక సారథులు: సీనియర్ టీచర్లు ఇన్‌ఛార్జీలుగా నియామకం

జనగామ జిల్లాలోని కేజీబీవీ బాధ్యతలను తాత్కాలికంగా సీనియర్ టీచర్లకు అప్పగించారు. జిల్లాలోని స్పెషల్ ఆఫీసర్లు (ఎస్ఓ) ఐదు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 21 ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్న తరుణంలో, విద్యార్థినులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విద్యాశాఖ అధికారులు ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.


