News September 11, 2025

KNR: ‘డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల’

image

2025-26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీలో అడ్మిషన్ పొందేందుకు రూపొందించిన దోస్త్ చివరి అవకాశంగా స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసిందని SRR ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ తెలిపారు. దోస్త్ వెబ్ సైట్‌లో ఖాళీల వివరాలు అందుబాటులో ఉంటాయని, స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ విద్యార్థులకు SEP 15, 16వ తేదీల్లో జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు.

Similar News

News December 16, 2025

కరీంనగర్: 454 మందికి రేపు అగ్ని పరీక్ష

image

కరీంనగర్ జిల్లాలో మూడో దఫా గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 108 గ్రామాలలో 454 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు పోటీపడుతున్నారు. హుజూరాబాద్, ఇల్లందకుంట, జమ్మికుంట, సైదాపూర్, వీణవంక మండలాల్లోని 108 సర్పంచ్, 1034 వార్డులకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు మండలాలలో 1,59,647 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

News December 16, 2025

KNR: మార్చిలోగా అమృత్‌-2 పనులు పూర్తి చేయాలి: సీడీఎంఏ

image

కరీంనగర్ జిల్లాలో అమృత్-2 పథకం కింద చేపట్టిన మంచినీటి సరఫరా పనులను మార్చిలోగా వేగవంతంగా పూర్తి చేయాలని సీడీఎంఏ శ్రీదేవి కమిషనర్లను ఆదేశించారు. పైప్‌లైన్‌, రిజర్వాయర్ల నిర్మాణాల పురోగతిపై ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. పనులు ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, వారానికి ఒకసారి పురోగతిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆమె స్పష్టం చేశారు.