News September 11, 2025

KNR: బీసీ రిజర్వేషన్ల చుట్టూనే స్థానిక ఎన్నికలు

image

బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. అయితే బీసీ బిల్లు, ఆర్డినెన్స్‌లు గవర్నర్, రాష్ట్రపతిల వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఈ సమయంలో ప్రభుత్వానికి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా ఉంది. అయితే రిజర్వేషన్ల చుట్టూనే రాజకీయాలు తిరుగుతుండగా, ఆశావాహులు నిరాశలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 1216 పంచాయతీలు, 60 జడ్పీటీసీ, 646 ఎంపీటీసీ స్థానాలున్నాయి.

Similar News

News December 17, 2025

రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు!

image

TG: పంచాయతీ ఎన్నికలు ముగుస్తుండటంతో పరిషత్(MPTC, జడ్పీ) ఎలక్షన్స్‌కు ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. తాజాగా ఈ ఫైల్‌ను అధికారులు సీఎంకు పంపారు. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించారు. పంచాయతీ తరహాలోనే రిజర్వేషన్లు ఖరారు చేశారు. సీఎం ఆమోదిస్తే ఈ నెల 25లోపు షెడ్యూల్ విడుదల, JANలో ఎన్నికలు పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్లు సమాచారం.

News December 17, 2025

మధ్యతరగతికి ‘వెండి’ వెలుగులు

image

ప్రస్తుతం బంగారం ధరలు అందనంత ఎత్తులో ఉన్నాయి. దీంతో ఈ రోజుల్లో పేద, మధ్యతరగతి వారికి వెండి పెట్టుబడి మంచి అవకాశంగా మారింది. కిలో వెండి ధర ఒక్కరోజే <<18588447>>రూ.11 వేలు పెరిగి<<>> రూ.2,22,000కు చేరి మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది. రాబోయే రోజుల్లో సిల్వర్ ధరలు మరింత ఎగబాకే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. బంగారంతో పోలిస్తే అందుబాటు ధరలో ఉన్న వెండిని కొనుగోలు చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు.

News December 17, 2025

NLG: ‘లెక్కలు చెప్పాల్సిందే..! లేదంటే వేటు తప్పదు’

image

జిల్లాలో తొలి, మలి విడతల్లో నిర్వహించిన ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు 45 రోజుల్లోగా ఎన్నికల ఖర్చును MPDOలకు తెలియజేసి రశీదు తీసుకోవాలి. లేదంటే వేటు పడే ప్రమాదం ఉంది. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమకు గుర్తులు కేటాయించిన నాటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అయిన ఖర్చుల వివరాలు సమర్పించాలని ఎంపీడీవో జ్ఞానప్రకాశరావు తెలిపారు.