News September 13, 2025
KNR: ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందారు కోల్’

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో వాడవాడలా బొడ్డెమ్మ పున్నం పండుగ ఘనంగా ప్రారంభమైంది. తీరొక్క పూలతో బొడ్డెమ్మను అలంకరించిన మహిళలు ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందారు కోల్’ అంటూ ఆనవాయితీగా పాడుతున్న పాటలను ఆలకిస్తూ చప్పట్లు కొడుతూ గౌరమ్మను కొలుచుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. తెలంగాణ సాంప్రదాయాన్ని చాటే ఈ పండుగను జరుపుకోవండం ఎంతో సంతోషంగా ఉందని వనితలు అన్నారు.
Similar News
News December 9, 2025
నేడు అమరావతిలో పర్యటించనున్న మంత్రి నారాయణ

అమరావతి రాజధాని ప్రాంతంలో మంగళవారం మంత్రి నారాయణ పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 8:30 నిమిషాలకు CRDA కార్యాలయం వద్ద బయలుదేరి అమరావతి రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం రోడ్ల నిర్మాణ పరులను పరిశీలించి మీడియాతో మంత్రి మాట్లాడతారని వెల్లడించారు.
News December 9, 2025
వనపర్తి: ఊర్లో ఎన్నిక.. సిటీలో ప్రచారం

నగరంలో బతుకుదెరువు, పొట్ట కూటి కోసం ఏదో ఒక పని చేసుకుంటూ రాష్ట్రంలోని ఆయా గ్రామాల నుంచి ఆయా వర్గాల ప్రజలు వచ్చి జీవిస్తుంటారు. ఈనెల14న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా సోమవారం వనపర్తి మండలం పెద్ద తండా(డి) గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాత్లావత్ రాజ్యా నాయక్ బోయినపల్లి, బాపూజీనగర్, హస్మత్‌పేట, సెంటర్ పాయింట్ ఏరియాలలో ఓటర్లను కలిసి అభ్యర్థించారు.
News December 9, 2025
పవన్ దిష్టి వ్యాఖ్యలపై మంత్రి మనోహర్ ఏమన్నారంటే?

AP: Dy.CM పవన్ వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కోనసీమకు దిష్టి తగిలిందని రైతులతో మాట్లాడిన సందర్భంలోనే అన్నారని, ఇది రాజకీయం చేయాల్సిన అంశం కాదని తెలిపారు. పవన్‌కు TG ప్రజలపై ఎంతో నమ్మకం, ప్రేమ ఉన్నాయని చెప్పారు. ఆ మాటలపై అనవసర రాద్దాంతం చేశారని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే జనసేన ప్రకటన విడుదల చేయగా, మరో మంత్రి కందుల దుర్గేశ్ సైతం వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.


