News August 21, 2025

KNR: ‘బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలి’

image

ఆర్థిక మద్దతు పథకాల లక్ష్య సాధనకు బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం నిర్వహించిన సమావేశంలో కోరారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 జూన్ వరకు రూ. 4314.88 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర లక్ష్యాలలో 32.12 శాతం మాత్రమే పూర్తయిందని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు.

Similar News

News January 14, 2026

కరీంనగర్ జిల్లాలో 2,292 టన్నుల యూరియా నిల్వలు

image

కరీంనగర్ జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. గత 15 రోజుల్లో వివిధ సొసైటీల ద్వారా 8,124 మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో మరో 2,292 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, అవసరానికి అనుగుణంగా అదనపు స్టాక్‌ను తెప్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

News January 12, 2026

కరీంనగర్ జిల్లాలో 765 యాక్సిడెంట్స్, 180 మరణాలు

image

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా సోమవారం చొప్పదండిలో కరీంనగర్ డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన జిల్లాలో 2025లో 765 రోడ్డు ప్రమాదాలు జరిగి 180 మృతి చెందినట్లు తెలిపారు. చొప్పదండిలోనే 31 యాక్సిడెంట్స్ జరిగాయన్నారు. ఓవర్ లోడ్, మద్యం సేవించి డ్రైవ్ చేయడం, మొబైల్ డ్రైవింగ్ వంటివి ప్రమాదాలకు కారణాలని తెలిపారు. రోడ్ సేఫ్టీ కోఆర్డినేటర్ నీలం సంపత్ పాల్గొన్నారు.

News January 11, 2026

హుజూరాబాద్‌: లాడ్జీలో యువకుడి ఆత్మహత్య

image

హుజూరాబాద్‌‌లోని వైస్రాయ్ లాడ్జీలో వడ్లకొండ చిరంజీవి(30) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం మందలోరిపల్లికి చెందిన చిరంజీవి, 2 రోజుల క్రితం లాడ్జీలో గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆదివారం ఉదయం నుంచి అతను ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు సాయంత్రం లాడ్జీకి చేరుకొని, గది కిటికీలో నుంచి చూడగా చిరంజీవి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు.