News August 14, 2025
KNR: భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసిన సీపీ గౌష్ ఆలం

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం కొత్తపల్లిలోని భరోసా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖలోని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో గత డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ కేంద్రం పనితీరును, బాధితులకు అందిస్తున్న సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పోలీస్ కమిషనర్ కేంద్రంలోని సిబ్బందితో మాట్లాడి, రికార్డులను పరిశీలించి, వాటిని సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
Similar News
News March 8, 2026
కరీంనగర్‌లో రేపు 2కే రన్

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో MCK నుండి అంబేద్కర్ స్టేడియం వరకు రేపు ఉదయం 6.30 2K రన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్పొరేషన్ లో E-వేస్ట్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఉద్యోగులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని, ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
News March 8, 2026
కరీంనగర్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

ప్రజావాణి కార్యక్రమానికి, జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తమ స్థానంలో ఇతర అధికారిని డిప్యూట్ చేయాలని, ప్రజల నుండి వచ్చే ప్రజావాణి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడం ప్రతి అధికారి బాధ్యత అని తెలిపారు.
News March 7, 2026
KNR: తహశీల్దార్‌పై ఏసీబీ పంజా.. రూ.4 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై గజ్వేల్ తహశీల్దార్ కమటం శ్రవణ్ కుమార్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కరీంనగర్‌లోని నివాసంతో పాటు మరో రెండు చోట్ల జరిపిన సోదాల్లో రూ.4 కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగుచూశాయి. వీటిలో 2 ఇళ్లు, ఒక అపార్ట్‌మెంట్ (6 ఫ్లాట్లు), మరో 4 ప్లాట్లు, రూ.11.90 లక్షల నగదు, కిలోల కొద్దీ బంగారం ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


