News August 15, 2025
KNR: భూ సేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ సంచాలకులు దుర్గాప్రసాద్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, రెవిన్యూ డివిజనల్ అధికారులు మహేశ్వర్, రమేష్ బాబుతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి భూసేకరణ సమస్యలపై గురువారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. KNR జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి 563 నిర్మాణం కోసం భూ సేకరణను వేగవంతం చేయాలని అన్నారు. ఈ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
Similar News
News March 17, 2026
జమ్మికుంట: స్వల్పంగా తగ్గిన పత్తి గరిష్ఠ ధర

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం గరిష్ఠంగా రూ.7,500 పలికిన పత్తి ధర నేడు రూ.50 తగ్గి రూ.7,450 వద్ద నిలిచింది. మార్కెట్‌కు మొత్తం 24 వాహనాల్లో 145 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి వచ్చింది. ధర తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
News March 15, 2026
KNR: ‘స్కిల్ డెవలప్‌మెంట్‌తోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం’

స్కిల్ డెవలప్‌మెంట్‌తోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలంగాణ విఠల్ నిరుద్యోగ జేఏసీ నేత పాలకూర అశోక్ అన్నారు. కరీంనగర్ ఫిలిమ్ భవన్లో డా.బీఎన్.రావు అధ్యక్షతన ‘ఉద్యోగ సమస్య – పరిష్కార మార్గాలు’ అనే అంశంపై నిరుద్యోగ సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సహజ వనరులు అధికంగా ఉన్న తెలంగాణలో రాజకీయ వనరులకోసం పరిపాలన జరుగుతుంది తప్ప ఉత్తమ ఉద్యోగ పాలసీని తయారు చేయలేక పోతున్నారని విమర్శించారు.
News March 15, 2026
కరీంనగర్: ఎస్సీ యువతకు GOOD NEWS

జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025 -26 ఎస్సీ వర్గాల ఆర్థిక అభివృద్ధి కోసం రవాణా, వ్యవసాయ రంగంలో స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తునట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఆసక్తిగల ఎస్సీ అభ్యర్థులు ఓబీ ఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఈ నెల 17 నుంచి 24 వరకు ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


