News August 12, 2025
KNR: మనస్తాపంతో యువకుడి సూసైడ్

కరీంనగర్ జిల్లాలో అత్త దూషించిందన్న మనస్తాపంతో భర్త సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా.. శంకరపట్నం మండలం అంబాలాపూర్‌కు చెందిన గుడిసె మహేందర్(24) తన భార్య తల్లి తిట్టిందని మనస్థాపంతో ఈనెల 4న గడ్డి మందు తాగి తాగాడు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు మహేందర్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు.
Similar News
News March 9, 2026
పిఠాపురం: జనసేన ఆవిర్భావ సభపై ఉత్కంఠ

మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈసారి భారీ సభ ఉంటుందా లేదా అనే దానిపై సర్వత్ర చర్చ జరుగుతోంది. ప్రతి సంవత్సరం పిఠాపురంలోనే సభ నిర్వహిస్తామని పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారు. అయితే సభకు సమయం తక్కువగా ఉండటంతో సోమవారం నాటికి ఎటువంటి ఏర్పాట్లు కనిపించకపోవడం గమనార్హం. దీనిపై అటు శ్రేణుల్లో, ఇటు ప్రజల్లో సందిగ్ధత నెలకొంది.
News March 9, 2026
షోకాజ్ నోటీసులపై సచివాలయ సర్వేయర్ల ఆగ్రహం

సెలవు పెట్టి ఆందోళనలో పాల్గొంటే షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై గ్రామ వార్డు సచివాలయ సర్వేయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్ర, శనివారాల్లో క్యాజువల్ లీవ్ పెట్టి నిరసన తెలిపిన తమకు, సోమవారం నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. రెండు రోజుల తర్వాత సెలవులను రద్దు చేయడంపై వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని సర్వేయర్లు హెచ్చరించారు.
News March 9, 2026
నిర్మల్: రోడ్డు ప్రమాదం.. ఇరు కుటుంబాల్లో విషాదం

నిర్మల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. మంజులాపూర్‌కు చెందిన సృజన్, నటరాజ్ నగర్‌కు చెందిన పృథ్వీరాజ్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. సృజన్ అక్కడికక్కడే మృతిచెందగా, పృధ్వీరాజ్ ఆస్పత్రికి తీసుకు వెళ్లేలోగా చనిపోయాడు. చేతికొచ్చిన కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు.


