News March 5, 2025
KNR: ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

ఉమ్మడి KNR, ADB, NZB, MDK ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో భాగంగా 11వ రౌండ్ తో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. 11వ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4935(75675), కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 4387(70565), బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 3473(60419) ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బీజేపీ అభ్యర్థి 5,110 లీడింగ్‌లో కొనసాగుతున్నారు.
Similar News
News December 15, 2025
మడకశిర సౌందర్యకు ‘శ్రీమతి ఆంధ్రప్రదేశ్’ రన్నరప్

మడకశిరకు చెందిన సోను సౌందర్య ‘శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025’ పోటీలలో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి మడకశిర ఖ్యాతిని రాష్ట్రస్థాయికి తీసుకెళ్లారు. విజయవాడలో జరిగిన ఈ పోటీలలో ఆమె సత్తా చాటారు. అక్టోబర్‌లో ‘శ్రీమతి విజయవాడ’ కిరీటాన్ని కూడా దక్కించుకున్న ఆమె, బ్యూటీషియన్‌గా కూడా రాణిస్తున్నారు. సౌందర్య సాధిస్తున్న విజయాలు నేటి గృహిణిలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
News December 15, 2025
నాగర్‌కర్నూల్ జిల్లాలో తగ్గుతున్న చలి తీవ్రత

నాగర్‌కర్నూల్ జిల్లాలో గత నాలుగైదురోజుల నుంచి చలి తీవ్రత తగ్గుతోంది. గడిచిన 24 గంటలో కల్వకుర్తి మండలం తోటపల్లిలో 11.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్ 11.7°C, యంగంపల్లి 12.4°C, తెలకపల్లి, కొండారెడ్డిపల్లి 12.5°C, బొల్లంపల్లి 12.8°C, తిమ్మాజిపేట 12.9°C, పెద్ద ముద్దునూరు 13.0°C, వెల్దండలో 13.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News December 15, 2025
దారుణం.. అదనపు కట్నం కోసం కోడలి హత్య!

TG: అదనపు కట్నం కోసం కోడల్ని దారుణంగా హత్య చేసిన ఘటన మహబూబాబాద్(D) కొమ్ముగూడెంలో చోటు చేసుకుంది. స్వప్న, రామన్న 15 ఏళ్ల క్రితం పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ₹3L కట్నం, 8 తులాల బంగారం, తర్వాత ఎకరం పొలం కట్నంగా ఇచ్చారు. అయినా వేధింపులు ఆగలేదు. తాజాగా ఆమెను కొట్టి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నోట్లో పురుగుమందు పోసి పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


