News November 6, 2025
KNR: ముగ్గురు మంత్రులు, ఒక కేంద్రమంత్రి.. అయినా ఈ పరిస్థితి..!

ఉమ్మడి KNR జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉందో తెలిపే ఘటన ఇది. మానకొండూరు(M) పోచంపల్లి మోడల్ స్కూల్ విద్యార్థినులు బస్సులు లేక రాత్రయినా రోడ్డుపై ఎదురుచూస్తూ కనిపించారు. అసలే చీకటి,సీసీ కెమెరాలు లేని ప్రాంతం, అమ్మాయిల భద్రతకు బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.ముగ్గురు మంత్రులు, ఒక కేంద్రమంత్రి ఉన్న జిల్లాలో ఈపరిస్థితి ఏంటని అంటున్నారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Similar News
News January 24, 2026
షోరూంలోనే రిజిస్ట్రేషన్.. నేటి నుంచే అమల్లోకి

TG: వాహనాల రిజిస్ట్రేషన్ కోసం RTO ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు నేటితో ముగియనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్’ విధానం నేటి నుంచి అమల్లోకి వస్తోంది. నిన్న మాదాపూర్‌లో చేసిన ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. ఇకపై బండి కొన్న షోరూమ్‌లోనే ఫొటోలు, డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి అక్కడికక్కడే నంబర్ పొందొచ్చు. RC నేరుగా ఇంటికే పోస్టులో వచ్చేస్తుంది.
News January 24, 2026
యాదగిరిగుట్టలో రౌడీషీటర్ హత్య..UPDATE

యాదగిరిగుట్ట మైలార్‌గూడెం శివారులో ఓ కాటేజీలో శుక్రవారం <<18940229>>రౌడీషీటర్ <<>>నిశాంత్ ఠాకూర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. పట్టణంలోని అంగడిబజార్‌కు చెందిన నిశాంత్ తన స్నేహితుడితో కలిసి కాటేజీకి వెళ్లగా, అక్కడ మరో వ్యక్తితో గొడవ జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు నిశాంత్‌ను కత్తితో పొడిచి పరారయ్యారు. మృతుడిపై గతంలో 11కేసులున్నాయని, పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా ప్రవర్తన మార్చుకోలేదని సీఐ భాస్కర్ తెలిపారు.
News January 24, 2026
ఖమ్మం జిల్లాలో ఇసుక మాఫియాకు చెక్

ఇప్పటి వరకు విచ్చలవిడిగా సాగిన ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట పడనుంది. జిల్లాలో ఇసుక కావాల్సిన వారు ‘మన ఇసుక-మన వాహనం’ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే 24గంటల్లో డోర్ డెలివరీ చేస్తారు. క్వారీ నుంచి ఇంటి దూరాన్ని బట్టి ధర ఉంటుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. వారంరోజుల్లో ఈ యాప్ అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.


