News August 14, 2025
KNR: రాఖీ పండుగ ఎఫెక్ట్.. రూ.15 కోట్ల పై ఆదాయం

ఆర్టీసీ KNR రీజియన్ పరిధిలో రాఖీ పండుగ సందర్భంగా ఈ నెల 7 నుంచి 11 వరకు(ఐదు రోజుల) వ్యవధిలో మొత్తం రూ.15 కోట్ల పై ఆదాయం సమకూరింది. రీజియన్ వ్యాప్తంగా 29,10,435 మంది ప్రయాణించారు. KNR-1 డిపో 1.59 కోట్లు, KNR-2 2.41 కోట్లు, HSNB 87.34 లక్షలు, HZB 1.17 కోట్లు, GDK 2.23 కోట్లు, JGL 1.78 కోట్లు, KRTL 1.14 కోట్లు, మంథని 85.4 లక్షలు, MTPL 1.07 కోట్లు, SRCL 1.17 కోట్లు, VMD 1.14 కోట్లు ఆదాయం రాబట్టింది.
Similar News
News March 6, 2026
10 రోజులు కరెంట్ కోతలు.. ఎందుకంటే?

TG: రాష్ట్రంలో రాబోయే 10 రోజులు గృహ అవసరాలకు షెడ్యూల్ చేయని కరెంట్ కోతలు ఉంటాయని తెలుస్తోంది. విద్యుత్ డిమాండ్ పెరగడంతో హైదరాబాద్‌తో సహా అనేక చోట్ల పవర్ సప్లై పరికరాలు ఓవర్‌లోడ్‌ను ఎదుర్కొంటున్నాయి. దీంతో అధికారులు నిర్వహణ పనులు చేపట్టారు. ఈ పనుల పూర్తికి కనీసం వారం పట్టనుంది. గ్రామాల్లోనూ పాత ట్రాన్స్‌ఫార్మర్‌లను మారుస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తామని అధికారులు తెలిపారు.
News March 6, 2026
పునరావాస కేంద్రాల్లో ‘భూదాన్’ బాధితుల అరిగోస

ఖమ్మంలోని అంబేద్కర్ భవన్, టీటీడీసీ పునరావాస కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులు అవస్థలు పడుతున్నారు. కనీసం వాష్‌రూమ్ సౌకర్యం కూడా లేదని, స్వచ్ఛంద సంస్థలు అందించే భోజనమే దిక్కని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
News March 6, 2026
శాసనమండలిలో వైయస్‌ఆర్‌సీపీ మరో వాయిదా తీర్మానం

ఏపీ శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యులు మరోసారి వాయిదా తీర్మానం ఇచ్చారు. విశాఖలో గీతం యూనివర్సిటీకి సంబంధించిన రూ.5 వేల కోట్ల విలువైన భూదోపిడీ అంశంపై మండలిలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. నిన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం చర్చకు అనుమతించలేదని విమర్శించారు. విశాఖ భూముల వ్యవహారంపై చర్చించే ధైర్యం ఉందా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు


