News November 19, 2025
KNR: వచ్చే నెలలోనే స్థానిక సమరం.. పల్లెల్లో సందడి వాతావరణం..!

బీసీ రిజర్వేషన్లపై ప్రతిష్ఠంభన సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీతో వీడింది. దీంతో పల్లెల్లో స్థానిక సమరం షురూ కానుంది. డిసెంబర్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం తాజాగా పచ్చజెండా ఊపింది. కేవలం పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించడానికి నిర్ణయించింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1,216 గ్రామపంచాయతీలు ఉండగా, 60 ZPTC, 646 MPTC స్థానాలు ఉన్నాయి. SHARE IT.
Similar News
News January 23, 2026
KMR: 4,408 ఫోన్లు రికవరీ

సెల్ ఫోన్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, CIER పోర్టల్ ద్వారా వాటిని తిరిగి పొందవచ్చని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శుక్రవారం కామారెడ్డిలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రికవరీ వివరాలను వెల్లడించారు. CEIR పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ₹7.05 కోట్ల విలువైన 4,408 ఫోన్లను రికవరీ చేసినట్లు పేర్కొన్నారు.
News January 23, 2026
NLG: నల్గొండలో త్రిముఖ పోటీ

నల్గొండ కార్పొరేషన్‌కు జరగనున్న ఎన్నికల్లో త్రిముఖ పోటీకి రంగం సిద్ధం అవుతోంది. షెడ్యూల్ వచ్చేలోగా అధికారికంగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి ప్రచారంలో దిగేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్, సీపీఎంతో జతకలిసి ఈ ఎన్నికల్లో తలపడనున్నది. బీజేపీ సైతం నల్గొండ కార్పొరేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అభ్యర్థిత్వాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది.
News January 23, 2026
NZB: అండమాన్‌కు అజాద్ హిందూ పేరు పెట్టాలని కవిత లేఖ

అండమాన్‌కు అజాద్ హిందూ పేరు పెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి NZB మాజీ MP, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖ రాశారు. జాగృతి కూడా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ల డిమాండ్‌ను సపోర్ట్ చేస్తోందన్నారు. తమకున్న నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ డిమాండ్ వచ్చేలా చేస్తామని లేఖలో పేర్కొన్నారు. అండమాన్ నికోబార్ పేరును బ్రిటీష్ వాళ్లు పెట్టారన్నారు.


