News November 19, 2025
KNR: వచ్చే నెలలోనే స్థానిక సమరం.. పల్లెల్లో సందడి వాతావరణం..!

బీసీ రిజర్వేషన్లపై ప్రతిష్ఠంభన సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీతో వీడింది. దీంతో పల్లెల్లో స్థానిక సమరం షురూ కానుంది. డిసెంబర్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం తాజాగా పచ్చజెండా ఊపింది. కేవలం పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించడానికి నిర్ణయించింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1,216 గ్రామపంచాయతీలు ఉండగా, 60 ZPTC, 646 MPTC స్థానాలు ఉన్నాయి. SHARE IT.
Similar News
News January 19, 2026
డిసెంబర్ నాటికి సమస్యలు ఉండ కూడదు: కలెక్టర్

వన్ విలేజ్ 4 విజిట్ కార్యక్రమంలో ప్రజలు తెలిపిన సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వన్ విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమంలో ప్రజలు, రైతులు తెలియజేసిన రెవెన్యూ సంబంధిత సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలన్నారు. జిల్లావ్యాప్తంగా డిసెంబర్ నాటికి సమస్యలు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు.
News January 19, 2026
ఘనంగా గణతంత్ర వేడుకలు: కర్నూలు కలెక్టర్

కర్నూలు జిల్లాలో జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేడుకల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
News January 19, 2026
పంచాయతీలకు 8 ఈ-ఆటోల పంపిణీ

పుట్టపర్తిలోని జిల్లా పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం డీపీఓ సమత 8 ఈ-ఆటోలకు పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలోని గ్రామాల్లో పరిశుభ్రతను పెంచేందుకు వీటిని పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనకల్లు, రోళ్ళ, ఎన్‌పీ కుంట, మడకశిర, తలుపుల, గాండ్లపెంట, పరిగి, నల్లచెరువు మండలాల పంచాయతీలకు వీటిని కేటాయించారు. చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు.


