News November 19, 2025
KNR: వచ్చే నెలలోనే స్థానిక సమరం.. పల్లెల్లో సందడి వాతావరణం..!

బీసీ రిజర్వేషన్లపై ప్రతిష్ఠంభన సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీతో వీడింది. దీంతో పల్లెల్లో స్థానిక సమరం షురూ కానుంది. డిసెంబర్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం తాజాగా పచ్చజెండా ఊపింది. కేవలం పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించడానికి నిర్ణయించింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1,216 గ్రామపంచాయతీలు ఉండగా, 60 ZPTC, 646 MPTC స్థానాలు ఉన్నాయి. SHARE IT.
Similar News
News January 17, 2026
ములుగు ఓఎస్డీ శివం ఉపాధ్యాయ బదిలీ

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐపీఎస్ బదిలీల్లో భాగంగా ములుగు జిల్లా ఓఎస్డీగా ఉన్న శివం ఉపాధ్యాయను డీసీపీ ట్రాఫిక్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కి బదిలీ చేశారు. 2021 బ్యాచ్‌కు చెందిన శివం ఉపాధ్యాయ ఇంతకుముందు ఏటూర్ నాగారం ఎఎస్పీగా పనిచేసి, ఇటీవలే ములుగు ఓఎస్డీగా బదిలీపై వచ్చారు. మేడారం జాతర సమయంలో చురుగ్గా పనుల్లో పాల్గొంటున్న ఈ సమయంలో ఓఎస్డీని బదిలీ చేయడం పోలీసు వర్గాల్లో సంచలనం స్భష్టించింది.
News January 17, 2026
అనంతపురం: భార్యను బండరాయితో మోదిన భర్త

అగ్నిసాక్షిగా మూడు ముళ్ళు వేసిన భర్త కట్టుకున్న భార్యకు కాలయముడయ్యాడు. బండరాయితో భార్య తలపై మోది హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాయదుర్గం మండలంలోని టి.వీరాపురంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. రక్తపు మడుగులో ఉన్న భార్య శివగంగమ్మను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి భర్త సుంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 17, 2026
పెద్దపల్లి: కలెక్టర్ చొరవ.. అనాథ మహిళకు ఆశ్రయం

మానసిక అనారోగ్యంతో బాధపడుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ మహిళకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అండగా నిలిచారు. తనకు ఎవరూ లేరని, ఆదుకోవాలని ఆమె పెట్టుకున్న అర్జీపై కలెక్టర్ తక్షణమే స్పందించారు. హైదరాబాద్ చౌటుప్పల్‌లోని ‘అమ్మానాన్న’ అనాథ ఆశ్రమానికి తరలించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత శనివారం వారిని సురక్షితంగా ఆశ్రమానికి చేర్చారు.


