News November 19, 2025

KNR: వచ్చే నెలలోనే స్థానిక సమరం.. పల్లెల్లో సందడి వాతావరణం..!

image

బీసీ రిజర్వేషన్లపై ప్రతిష్ఠంభన సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీతో వీడింది. దీంతో పల్లెల్లో స్థానిక సమరం షురూ కానుంది. డిసెంబర్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం తాజాగా పచ్చజెండా ఊపింది. కేవలం పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించడానికి నిర్ణయించింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1,216 గ్రామపంచాయతీలు ఉండగా, 60 ZPTC, 646 MPTC స్థానాలు ఉన్నాయి. SHARE IT.

Similar News

News January 20, 2026

KNR: ‘పే స్కేల్ బకాయిలను వెంటనే చెల్లించాలి’

image

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ బస్టాండ్ ఆవరణలోని ఆర్ఎం కార్యాలయం ఎదుట ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు నిరసన తెలిపారు. 2017 పే స్కేల్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఎస్ఆర్‌బీఎస్ లైఫ్ సర్టిఫికెట్‌ను వెంటనే ఆన్ లైన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

News January 20, 2026

మల్లె మొగ్గలను తొలిచే పురుగుల నివారణ ఎలా?

image

మల్లె తోటల్లో మొగ్గలను తొలిచి తినే పురుగు వల్ల పంటకు తీవ్ర నష్టం కలుగుతుంది. దీని నివారణకు 5 శాతం వేప కాషాయం లేదా థయోక్లోప్రిడ్ 21.7% S.C. 1ml లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 18.5% S.C 0.3ml లేదా స్పైనోశాడ్ 45% ఎస్.సి. 0.3మి.లీ. లేదా క్వినాల్ ఫాస్ 25% ఇ.సి. 2మి.లీ.లలో ఏదైనా ఒకదానిని లీటరు నీటికి కలుపుకొని మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. ఎకరానికి 6 నుంచి 8 చొప్పున లింగాకర్షణ బుట్టలు అమర్చాలి.

News January 20, 2026

₹15 లక్షల భరణం అడిగిన భార్య.. భర్త ఏం చేశాడంటే..

image

భార్య ₹15 లక్షల భరణం అడిగిందని ఉద్యోగానికి రిజైన్ చేశాడో భర్త. కెనడాకు చెందిన దంపతులు సింగపూర్‌లో ఉంటున్నారు. 2023లో అతడు భార్యతో విడిపోయాడు. తనకు, పిల్లల(4)కు కలిపి నెలకు S$20వేలు(₹15L) భరణం ఇవ్వాలని ఆమె అడగడంతో జాబ్ మానేశాడు. 2023లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా అతడి వార్షిక జీతం S$8.6 లక్షలు(₹6Cr). ఈ క్రమంలో ఆమెకు S$6.34 లక్షలు(₹4.47Cr) చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు తాజాగా ఆదేశాలిచ్చింది.