News August 22, 2025
KNR: శ్వేత హోటల్లో వ్యక్తి ఆత్మహత్య

కరీంనగర్ సిటీలోని శ్వేతా హోటల్‌లో ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఎండీ ముదస్సర్ సికింద్రాబాద్ బ్లిజ్ ఫుల్ ఫార్మ్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. శ్వేత హోటల్‌కు వచ్చిన ఆయన శుక్రవారం సాయంత్రం తన గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్ నోట్‌లో తన చావుకు ఎవరూ కారణం కాదని రాశాడు.
Similar News
News January 16, 2026
225 పోస్టులకు నోటిఫికేషన్

<
News January 16, 2026
తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గి రూ.1,43,400 వద్ద ట్రేడవుతుండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,31,450కు చేరుకుంది. వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ఏకంగా రూ.4,000 తగ్గి రూ.3,06,000 వద్ద కొనసాగుతోంది. కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే విషయమే అయినా ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.
News January 16, 2026
చిత్తూరు: అసభ్యకర పోస్టులపై విచారణ

సమాచార శాఖ.కుప్పం అధికారిక వాట్సాప్ గ్రూపులో <<18869391>>అసభ్యకర వీడియోలు <<>>కలకలం రేపాయి. ఇదే అంశంపై Way2Newsలో ప్రచురితమైన వార్తకు పోలీసులు స్పందించారు. చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో విచారణ చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గ ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో పాటు కుప్పం RDO, I&PR అధికారులు ఉన్న గ్రూపులో గురువారం సాయంత్రం అసభ్యకరమైన పోస్టులు షేర్ చేయగా నిమిషాల వ్యవధిలో ఆ అధికారి డిలీట్ చేశారు.


