News November 12, 2025
KNR: బ్రెయిన్ ట్యూమర్‌ను జయించి టెక్నాలజీ దున్నేస్తున్న విద్యార్థి

బ్రెయిన్ ట్యూమర్ బారిన పడి మూడు శస్త్రచికిత్సలు చేయించుకున్నా, KNR(D) శంకరపట్నం(M) చింతలపల్లికి చెందిన మనోహర్ టెక్నాలజీపై అద్భుతమైన పట్టు సాధించాడు. కాలక్షేపం కోసం తండ్రి ఇచ్చిన ల్యాప్‌టాప్‌ను సద్వినియోగం చేసుకుని, గూగుల్‌లో శోధించి వెబ్‌సైట్ల తయారీ, యాప్ రూపకల్పన, చాట్‌బాట్, ఏఐ ఫోటోషూట్‌లపై పట్టు సాధించాడు. ప్రతిభను గుర్తించిన రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఈరోజు HYDలో విద్యార్థిని సన్మానిస్తున్నారు.
Similar News
News November 12, 2025
విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి: కలెక్టర్

నూతన విద్యా విధానం డిజిటల్ తరగతులు ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించే విధంగా విద్యార్థులకు అవసరమైన విద్య బోధనలు, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. నెల్లికుదురు మండలంలోని కేజీబీవీనీ ఆకస్మికంగా తనిఖీ చేసి స్టోర్ గది, టాయిలెట్స్, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, పరిసరాలను పరిశీలించారు. పిల్లలకు హెల్త్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ శానిటేషన్‌లపై అవగాహన కల్పించాలన్నారు.
News November 12, 2025
పుట్టపర్తికి రాష్ట్రపతి, ప్రధాని రాక

పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19న పుట్టపర్తికి రానున్నారు. 22న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్‌లు, దేశవిదేశీ వీవీఐపీలు రానున్నారు. ఈ నెల 13 నుంచి 23 వరకూ పది రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.
News November 12, 2025
FLASH: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈరోజు అధికారులు డ్రగ్స్ పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడు సలీంను (DRI) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అతడి బ్యాగులో 4.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, సలీంను అదుపులోకి తీసుకున్న అధికారులు, నిషేధిత వస్తువులను సీజ్ చేశారు.


