News October 7, 2025
KNR: 42% రిజర్వేషన్లు.. BC అభ్యర్థుల్లో టెన్షన్..!

42% BC రిజర్వేషన్లపై రేపు హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి KNR వ్యాప్తంగా బరిలో నిలవాలనుకున్న BC అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 42%కి పెంచుతూ ప్రభుత్వం GO జారీ చేసింది. రిజర్వేషన్లకు అనుగుణంగానే ఈసీ సైతం షెడ్యూల్ విడుదల చేసింది. కాగా, రేపు కోర్టులో తీర్పు అనుకూలంగా వస్తే ఎలా, వ్యతిరేకంగా వస్తే ఎలా ముందుకెళ్లాలన్న దానిపై పల్లెల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
Similar News
News January 14, 2026
భోగి పండ్లు ఎలా, ఎప్పుడు పోయాలి?

భోగి సందర్భంగా ఇవాళ చిన్నారులపై భోగి పండ్లు పోసే సంప్రదాయం తరతరాలుగా వస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం మేరకు.. చెరకు ముక్కలు, రేగి పండ్లు, పైసలు కలిపి పిల్లలను కూర్చోబెట్టి దిగదుడుపు తీసి తలమీద నుంచి కిందకు వదిలేయాలి. దీంతో భోగి పీడ తొలగిపోయి వాళ్లు భోగం అనుభవించడానికి కావలసిన శక్తిని పొందుతారు. అయితే సాయంత్రం వేళ వీటిని పోస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు.
News January 14, 2026
ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ నుంచి ‘SIR’

AP, TGలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను ఏప్రిల్, మే నెలల్లో పూర్తి చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. బిహార్‌లో తొలి దశ ముగియడంతో రెండో దశను 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్, TN, UP, WB సహా పలు ప్రాంతాల్లో ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దీంతో మూడో దశలో ఏపీ, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ‘సర్’ చేపట్టనున్నారు.
News January 14, 2026
మెట్రో మార్కు చిత్రకళ.. ‘పరిచయ్’ అదిరింది బాసూ!

మెట్రో రైలును పట్టాలెక్కించినట్టే చిత్రకారుల ప్రతిభను ప్రపంచానికి చాటాలంటున్నారు NVS రెడ్డి. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘పరిచయ్ ఆర్ట్ ఫౌండేషన్’ నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్, క్యాంప్ కళాభిమానులను ఫిదా చేస్తోంది. ఒకేచోట ప్రదర్శన, ప్రత్యక్ష చిత్రలేఖనం చూడటం అరుదైన అవకాశమని చెప్పుకొచ్చారు. జయవంత్ నాయుడు ఆధ్వర్యంలో 12 మంది దిగ్గజ చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన అద్భుతాలు ఇక్కడ కొలువుదీరాయి.


