News April 29, 2024

KNR: 44 రోజుల్లో రూ.9.71 కోట్ల నగదు స్వాధీనం

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు ఉమ్మడి జిల్లాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 28 వరకు నిర్వహించిన తనిఖీలలో రూ.9.71 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ. 71లక్షలకు మాత్రమే ఆధారాలు చూపించి వెనక్కి తీసుకున్నారు. బంగారం, మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News April 14, 2026

KNR: ‘ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి’

image

కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తోన్న అరైవ్ – అలైవ్ రోడ్డు భద్రత వారోత్సవాల వాల్ పోస్టర్లను సోమవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. అరైవ్ – అలైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ RESULTS.. కరీంనగర్‌కు 7వ ర్యాంకు

image

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. కరీంనగర్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 14943 మంది పరీక్షలు రాయగా 11961 మంది పాసై 80.04 శాతంతో స్టేట్‌లోనే 7వ ర్యాంకు వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1320 మందికి 876 మంది పాసై 66.36 శాతంతో 30వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 1837 మందికి 591 మంది పాసై 32.17%తో 16వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 163 మందికి 71 మంది పాసై 43.56%తో 28th ప్లేస్ వచ్చింది.

News April 12, 2026

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. కరీంనగర్‌కు 6వ ర్యాంకు

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. కరీంనగర్ జిల్లాలో రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు 16726 మంది పరీక్ష రాయగా 11737 మంది పాసై 70.17 శాతంతో స్టేట్‌లోనే 6వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 1,449 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 822 మంది విద్యార్థులు పాసై 56.73 శాతంతో స్టేట్‌లో 24వ స్థానంలో నిలిచింది.