News September 10, 2025

KNR: SU LLB, LLM పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల

image

SU పరిధిలో జరగనున్న LLB 4వ సెమిస్టర్, LLM 2వ, 4వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. దీని ప్రకారం అపరాధ రుసుము(లేట్ ఫీ) లేకుండా SEPT 18 వరకు, లేట్ ఫీజు రుసుము రూ.300తో SEPT 22 వరకు చెల్లించుకోవచ్చని శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణాధికారి డా.సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్‌ను లేదా ఆయా కళాశాలలను సంప్రదించవచ్చని సూచించారు.

Similar News

News December 17, 2025

చెన్నారావుపేట: సెల్యూట్.. జయరాజ్ పోలీస్ అన్న!

image

చెన్నారావుపేట మండలం బోజేరువు గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ పని తీరుకు ప్రజలు సెల్యూట్ పోలీస్ అన్న అని మెచ్చుకుంటున్నారు. గ్రామానికి చెందిన ఓ పండు ముసలావిడ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే ప్రయత్నం చేస్తున్న విధానాన్ని గమనించిన హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ ఆమెను తన భుజాలపై పోలింగ్ కేంద్రంలోకి మోసుకు వెళ్లారు. ఈ దృశ్యం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది.

News December 17, 2025

మెదక్: సమయం లేదు ఓటరన్నా.. పరిగెత్తు..!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ క్లైమాక్స్‌కు చేరుకుంది. మధ్యాహ్నం 1 గంటకే సమయం ఉండటంతో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. క్యూలైన్‌లో ఉన్న వారికే ఓటు వేసే అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి వాహనాలు ఏర్పాటు చేసి, బస్సు ఛార్జీలు ఇచ్చి మరీ పిలిపిస్తున్నారు. గడువు ముగిసేలోపు తమ మద్దతుదారులందరితో ఓటు వేయించేందుకు అభ్యర్థులు ఆఖరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.

News December 17, 2025

గాజాకు బలగాలు?.. సంకటంలో పాకిస్థాన్!

image

గాజా స్టెబిలైజేషన్ ఫోర్స్‌కు సైనికులను అందించాలని పాకిస్థాన్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. అయితే దీనికి ఒప్పుకోలేక, కాదనలేక పాక్ సంకటంలో ఉంది. సైనికులను పంపిస్తే సొంత దేశంలోనే నిరసనలు ఎదురయ్యే అవకాశం ఉంది. US, ఇజ్రాయెల్‌ను పాక్ ఇస్లామిక్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సైనికులను పంపకపోతే ట్రంప్ ఆగ్రహానికి గురికాక తప్పదు. దీంతో ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంది పాక్ పరిస్థితి.