News January 31, 2025
KNR: పట్టభద్రులు మేల్కోండి.. నేడే LAST

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లా పట్టభద్రుల మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీ దారులు క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టభద్రులను, ఉపాధ్యాయులను కలుస్తూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ నమోదుకు దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది.
Similar News
News February 28, 2025
NZB: మార్చ్1న జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు

నిజామాబాద్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చ్1న జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.విజయ్ కాంత్ రావు తెలిపారు. కంఠేశ్వర్ బైపాస్ రోడ్ వద్ద ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. అండర్ 14, 16, 18 బాలికలతో పాటు మహిళ, పురుషులకు వేరువేరుగా ఎంపికలు ప్రక్రియ ఉంటుందన్నారు. ఎంపికైన వారిని హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామన్నారు.
News February 28, 2025
ప్రధానోపాధ్యాయుడిని అభినందించిన అమెరికా రాయబారి

రామప్ప ఆలయ సందర్శనానికి వచ్చిన అమెరికా రాయబారి జెనీఫర్ లాడ్సన్‌తో అమెరికా ఎన్నారై పులి రవి గౌడ్ ఆధ్వర్యంలో కాటాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు మాటాముచ్చట చేశారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ ఆనందంగా విద్య నభ్యసించాలని జెనీఫర్ లాడ్సన్ అన్నారు. విద్యార్థుల అభివృద్ధిని ప్రోత్సహిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ ను ఆమె అభినందించారు.
News February 28, 2025
ఇంటర్మీడియట్ పరీక్షలకు వేళాయె..!

★ మార్చి 5 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు
★ మహబూబ్ నగర్ జిల్లాలో 22483 మంది ఇంటర్ విద్యార్థులు
★ ప్రథమ సంవత్సరం:10922
★ ద్వితీయ సంవత్సరం:11561 మంది
★ జిల్లాలో 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
★ పరీక్షల సందర్భంగా 144 సెక్షన్ అమలు
★ సిట్టింగ్ స్వ్కాడ్‌లు,ఫైయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు
★ ఇప్పటికే విడుదలైన హాల్ టికెట్లు
★ పరీక్ష సమయం: ఉ.9 నుంచి మ.12 వరకు
★ పరీక్షకు ఒక రోజు ముందే అన్ని సిద్ధం చేసుకోండి.