News April 12, 2024

కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన హిట్‌మ్యాన్

image

ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో మరో రికార్డు బద్దలు కొట్టారు. గెలిచిన మ్యాచ్‌ల్లో అత్యధిక రన్స్ కొట్టిన రెండో బ్యాటర్‌గా రికార్డు సాధించారు. రోహిత్ ఇప్పటివరకు 3,882 పరుగులు చేశారు. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (3,876) ని అధిగమించారు. అగ్రస్థానంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ (3,945) ఉన్నారు.

Similar News

News December 15, 2025

2029 ఎన్నికల్లో పోటీ చేస్తా: కవిత

image

TG: 2029 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. Xలో ఆమె #AskKavitha హ్యాష్ ట్యాగ్‌తో క్వశ్చన్ హవర్ నిర్వహిస్తున్నారు. మీ కొత్త పార్టీ పేరు ఏంటి? అని ఓ నెటిజన్ అడగగా ‘ఎలా ఉండాలి’ అని ఆమె బదులిచ్చారు. జాగృతిని గ్రామాలకు విస్తరిస్తానని, ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. 2047 నాటికి ఫ్రీ&క్వాలిటీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అందించడమే తన విజన్&మిషన్ అని పేర్కొన్నారు.

News December 15, 2025

ICC ప్లేయర్స్ ఆఫ్ ది మంత్‌గా షెఫాలీ, హార్మర్

image

ఈ ఏడాది వన్డే WC ఫైనల్లో రాణించిన భారత మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (నవంబర్) అవార్డు గెలుచుకున్నారు. ప్రతీకా రావల్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన వర్మ.. ఫైనల్లో 87 రన్స్&2 వికెట్లు తీసి భారత్ గెలుపులో కీలకమయ్యారు. మరోవైపు పురుషుల విభాగంలో సౌతాఫ్రికా స్పిన్నర్ హార్మర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు సొంతం చేసుకున్నారు. టీమ్ ఇండియాతో జరిగిన రెండు టెస్టుల్లో ఆయన 17 వికెట్లు తీశారు.

News December 15, 2025

ఒకే రోజు రెండుసార్లు పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ <<18569611>>ఉదయం<<>> నుంచి రెండుసార్లు బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ఉదయం నుంచి రూ.1,470 పెరిగి రూ.1,35,380కు చేరింది. 6 రోజుల్లోనే రూ.5,940 పెరగడం గమనార్హం. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,350 ఎగబాకి రూ.1,24,100 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,15,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.