News November 20, 2025

KTRను ప్రాసిక్యూట్ చేసేందుకు పర్మిషన్.. వివరాలు ఇవే!

image

TG: ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో క్విడ్ ప్రోకో జరిగినట్లు ACB గతంలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రూ.54.88 కోట్ల నిధులు దారి మళ్లించినట్లు ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ 4 సార్లు ACB విచారణకు హాజరయ్యారు. డాక్యుమెంట్లు, ఈమెయిల్స్, ఎలక్ట్రానిక్ రికార్డులు కలెక్ట్ చేసింది. దీనిపై KTRను ప్రాసిక్యూట్ చేసేందుకు సెప్టెంబర్‌లో ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరగా ఇప్పుడు <<18337628>>పర్మిషన్<<>> ఇచ్చారు.

Similar News

News January 15, 2026

ఫోన్ ఎత్తుకెళ్లిన బెంగాల్ సీఎం.. సుప్రీంకోర్టులో ఈడీ

image

వెస్ట్ బెంగాల్ ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలపై సుప్రీంకోర్టులో వాడీవేడీగా విచారణ జరిగింది. సోదాల సమయంలో WB సీఎం మమతా తమ ఫోన్‌ను ఎత్తుకెళ్లినట్లు ఈడీ అధికారులు SCకి తెలియజేశారు. మనీలాండరింగ్ విషయమై సోదాల గురించి ముందే స్థానిక PSకు సమాచారమిచ్చినా పోలీసులతో మమతా తమ సోదాలకు అంతరాయం కలిగించారన్నారు. అటు పోలీసులను మమత నియంత్రించడం తీవ్రమైన అంశంగా సుప్రీంకోర్టు పరిగణించింది.

News January 15, 2026

పొద్దుతిరుగుడు నాటిన తర్వాత కలుపు నివారణ

image

పొద్దుతిరుగుడు విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు 200 లీటర్ల నీటిలో 1 లీటర్ పెండిమిథాలిన్30% E.C రసాయనాన్ని కలిపి పిచికారీ చేయాలి. దీని వల్ల 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పంట 30-40 రోజుల దశలో అంతరకృషి చేయాలి. ఇది సాధ్యం కాకపోతే గడ్డి జాతి కలుపు నివారణకు ఎకరాకు 400ml క్విజాలొఫాప్ ఇథైల్ 5% ఇ.సి. లేదా ప్రొపాక్విజాఫాప్ 10% ఇ.సి. 250mlను 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు 2-4 ఆకుల దశలో పిచికారీ చేయాలి.

News January 15, 2026

ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు… అప్లై చేశారా?

image

<>ఇర్కాన్ <<>>ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ 32 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.. బీటెక్, బీఈ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 19 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు . నెలకు జీతం రూ.60 వేలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ircon.org