News August 12, 2025

KU డిగ్రీ రిజల్ట్స్ వచ్చేశాయ్!

image

మే నెలలో నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ రెగ్యులర్ 1, 2, 3, 4 సెమిస్టర్ పరీక్షలతో పాటు, దూర విద్య డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. వర్సిటీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చన్నారు. మొదటి సెమిస్టర్‌లో 31%, 2లో 30, 3లో 35, 4లో 39, దూరవిద్య మొదటి సెమిస్టర్‌లో 24% మంది ఉత్తీర్ణులయ్యారు. రీవాల్యుయేషన్ కోసం ఈనెల 27వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 13, 2026

NRPT: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

image

రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యే పది పరీక్షలకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 8:30 గంటల నుంచి 1:30 గంటల వరకు పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. కేంద్రాలకు దగ్గరలో సభలకు, సమావేశాలకు అనుమతి లేదని, జిరాక్స్ దుకాణాలు మూసివేయాలన్నారు.

News March 13, 2026

సాగు, తాగునీటిపై కలెక్టర్ ‘సమీక్ష’

image

ఎండలు ముదురుతున్న నేపథ్యంలో జిల్లాలో సాగు, తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మిర్యాలగూడ నుంచి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి, తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

News March 13, 2026

RR: ‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం.. 53,058 విద్యార్థులు

image

పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షలు శనివారం ప్రారంభమై.. ఏప్రిల్ 16వ తేదీ వరకు జరుగుతాయి. పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 255 సెంటర్లు 1,024 పాఠశాలల నుంచి 53,058 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. మాస్ కాపీకి పాల్పడకుండా సెట్టింగ్ స్క్వాయిడ్, ప్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు.