News October 5, 2025
లలిత సహస్ర నామాలు – వివరములు (2)

ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా |
రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా ||
ఉద్యద్భాను సహస్రాభా: వేల సూర్యుల కాంతితో సమానమైన తేజస్సు గల మాతా!
చతుర్బాహు సమన్వితా: నాలుగు చేతులు కలిగి ఉన్న తల్లి!
రాగస్వరూప పాశాఢ్యా: అనురాగం అనే రూపంలో ఉన్న పాశాన్ని ధరించి ప్రకాశించే దేవి!
క్రోధాకారాంకుశోజ్జ్వలా: కోపమునకు ప్రతీకైన అంకుశమనే ఆయుధంలా ప్రకాశిస్తున్న దేవత!
<<-se>>#LSN<<>>
Similar News
News January 14, 2026
సంక్రాంతి శుభవేళ ఆచరించాల్సిన సంప్రదాయాలు

సంక్రాంతి రోజున నదీ స్నానం చేసి అర్ఘ్యం వదలాలి. శివకేశవులు, లక్ష్మీదేవిని పూజించి, నువ్వులు, బెల్లం, కొత్త బియ్యం పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇంట్లోకి కొత్త చీపురు కొనడం లక్ష్మీప్రదమని పండితులు చెబుతారు. పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ, బ్రాహ్మణులకు స్వయంపాకం, వస్త్రదానం చేయడం వల్ల పితృదోషాలు తొలగుతాయి. అలాగే పేదలకు దానధర్మాలు చేస్తూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.
News January 14, 2026
భోగి పండ్లు ఎలా, ఎప్పుడు పోయాలి?

భోగి సందర్భంగా ఇవాళ చిన్నారులపై భోగి పండ్లు పోసే సంప్రదాయం తరతరాలుగా వస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం మేరకు.. చెరకు ముక్కలు, రేగి పండ్లు, పైసలు కలిపి పిల్లలను కూర్చోబెట్టి దిగదుడుపు తీసి తలమీద నుంచి కిందకు వదిలేయాలి. దీంతో భోగి పీడ తొలగిపోయి వాళ్లు భోగం అనుభవించడానికి కావలసిన శక్తిని పొందుతారు. అయితే సాయంత్రం వేళ వీటిని పోస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు.
News January 14, 2026
ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ నుంచి ‘SIR’

AP, TGలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను ఏప్రిల్, మే నెలల్లో పూర్తి చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. బిహార్‌లో తొలి దశ ముగియడంతో రెండో దశను 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్, TN, UP, WB సహా పలు ప్రాంతాల్లో ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దీంతో మూడో దశలో ఏపీ, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ‘సర్’ చేపట్టనున్నారు.


