News May 7, 2025
2 నెలల ‘ఉర్సా’కు రూ.99 పైసలకే భూమి కేటాయింపా?: వైసీపీ

AP: కేవలం 2 నెలల కిందట పుట్టిన ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సీఎం చంద్రబాబుకు ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని వైసీపీ ప్రశ్నించింది. ‘ఆ కంపెనీకి సరైన ఆఫీస్ లేదు. చెప్పుకోదగ్గ సిబ్బంది లేరు. కనీసం ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ కూడా లేదు. గతంలో పెద్ద పనులూ చేయలేదు. అలాంటి సంస్థకు విశాఖలో రూ.3వేల కోట్ల విలువైన 60 ఎకరాలను ఎలా ఇస్తారు? అది కూడా ఎకరం కేవలం రూ.99 పైసలకే’ అని Xలో నిలదీసింది.
Similar News
News February 7, 2026
9th విద్యార్థులకు మార్చిలోనే టెన్త్ పాఠాలు

AP: వచ్చే విద్యాసంవత్సరంలో 6-8 క్లాసుల సిలబస్, ఆ తర్వాతి ఏడాది 9,10 తరగతుల పాఠ్యాంశాలు మారతాయని విద్యాశాఖ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా జూన్‌లో టీచర్లకు శిక్షణకు ఇస్తామని తెలిపింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మార్చి 12 తర్వాత 9వ తరగతి స్టూడెంట్లకు టెన్త్ పాఠాలు బోధించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడంపై దృష్టిపెట్టాలని ఆదేశించింది.
News February 7, 2026
సకల దోష నివారణ మార్గం ‘సూర్య గ్రహ శాంతి’

జాతకంలో సూర్య దోషాలు ఉన్నవారు, సూర్య మహాదశ నడుస్తున్న వారు భాను సప్తమి నాడు సూర్య గ్రహ శాంతి పూజ, యజ్ఞం నిర్వహించడం శుభప్రదం. సూర్యుడు జాతకంలో ఆత్మకారకుడు, అధికారానికి చిహ్నం. ఈ రోజున చేసే జపం, హోమం వల్ల ప్రతికూల ప్రభావాలు తొలగి, సమాజంలో గౌరవం, వృత్తిలో విజయం లభిస్తాయి. ఈ హోమంలో పాల్గొనడం ద్వారా జాతకంలోని రవి నీచ స్థితి, గ్రహణ దోషాలు హరించుకుపోతాయి. జీవితంలో కొత్త వెలుగులు నిండుతాయి.
News February 7, 2026
జామలో తెల్ల సుడిదోమ వల్ల నష్టాలు – నివారణ

తెల్ల సుడిదోమ ఆకుల అడుగు భాగాన వలయాకారంలో గుడ్లను పెడతాయి. ఆకులపై తెల్లని దూదిలాంటి మెత్తని పదార్ధాన్ని కప్పి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులు ఎర్రబడి, ముడతలు పడి రాలిపోతాయి. వీటి నివారణకు రాత్రివేళ పసుపు రంగు జిగురు పూసిన అట్టలను చెట్ల వద్ద ఉంచాలి. సుడిదోమ ఆశించిన కొమ్మలను కత్తిరించి లీటరు నీటిలో 5ml వేపనూనె కలిపి పిచికారీ చేయాలి. ఇమిడాక్లోప్రిడ్-75% WGని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


